‘బిగ్ బాస్ – 4’ హోస్ట్ గా సమంత ?

787
Star heroine as host of Bigg Boss 4
Star heroine as host of Bigg Boss 4

బిగ్గెస్ట్ రియాలిటీ షో లలో ‘బిగ్ బాస్’ కూడా ఒకటి. ఈ షో ద్వారా కొంతమందికి క్రేజ్ వస్తే మరికొంతమందికి క్రేజ్ పోతుంది. ఎందుకంటే ఈ షో ద్వారా మనుషుల స్వభావం ఎలాంటిదో తెలిసిపోతుంది కాబట్టి. ప్రస్తుతం ‘బిగ్ బాస్’ ఇప్పుడు సీజన్ 4 కి సిద్ధం అవుతోంది. ఆడియెన్స్ ఇచ్చే ఓటింగ్ ఆధారంగా విజేతను నిర్ణయించే ఈ షోలో ‘బిగ్ బాస్’ సీజన్-1 లో హీరో శివబాలాజీ విన్నర్ గా నిలిచారు.

సీజన్ 2 మరియు సీజన్ 3లలో యాక్టర్ కౌశల్ అలానే బిగ్ బాస్ సీజన్ 3 లో రాహుల్ సిప్లిగంజ్ టైటిల్ గెలిచారు. కాగా మొదటి సీజన్ కు హోస్ట్ చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ బిగ్ బాస్ ను ప్రేక్షకుల్లోకి వెళ్లేలా చేశాడు. తర్వాత రెండో సీజన్ కి నాని చేసి అలరించారు. ఇక థర్డ్ సీజన్ కి కింగ్ అక్కినేని నాగార్జున హోస్ట్ చేసి టెలివిజన్ స్క్రీన్ పై సంచలనాలు క్రియేట్ చేశారు. బుల్లితెరపై అత్యధిక టీఆర్పీ సాధించిన రియాలిటీ షో గా నిలిచింది మూడవ సీజన్. ఇక ‘బిగ్ బాస్’ 4వ సీజన్ కి కూడా నాగార్జునే హోస్ట్ గా వ్యవహరించే అవకాశం ఉందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

ఐతే ఇప్పుడు ఈ సీజన్ కి ఓ స్టార్ హీరోయిన్ హోస్ట్ చేయబోతోందని పుకార్లు పుట్టుకొచ్చాయి. అక్కినేని నాగార్జున కాకుండా కోడలు సమంతను హోస్ట్ గా తీసుకోవడానికి నిర్వాహకులు ప్లాన్ చేస్తున్నారట. ఇంత వరకు బిగ్ బాస్ కి ఫిమేల్ సెలబ్రిటీ హోస్ట్ చేయలేదు. అయితే సీజన్ 3 లో ఒక్కటి రెండు ఎపిసోడ్స్ లో నాగార్జునకు వేరే షూటింగ్స్ ఉండటం వల్ల రమ్యకృష్ణ హోస్ట్ గా వ్యవహరించారు. బిగ్ బాస్ సీజన్ 4 కి హోస్ట్ గా ఇప్పుడు సమంత పేరు తెర మీదకి వచ్చింది. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

సుధీర్ అన్ని నాలుగు గోడల్ మధ్యలోనే చేస్తాడు.. సుధీర్ కి ప్రదీప్ పంచ్..!

లవ్ మ్యారేజ్ కావాలి.. నాలే అల్లరి చేయాలి : శ్రీముఖి

బిగ్‌బాస్‌ 4 సీజన్ లో బిత్తిరి సత్తి ?

కాజల్ పెళ్లి చేసుకోబోతుందా ? అబ్బాయి ఎవరు ?

Loading...