Friday, March 29, 2024
- Advertisement -

ఈ హీరోయిన్స్ పై ఆంటీ అంటూ కామెంట్స్.. వాళ్లేం అన్నారంటే ?

- Advertisement -

సోషల్ మీడియాలో సెలెబ్రిటీలతో నెటిజన్లు నేరుగా ఇంటరాక్ట్ ఛాన్స్ కలుగుతోంది. అయితే దానిని కొందరు పద్దతిగా మాట్లాడుతూ.. సెలబ్రిటీలను పలకరిస్తుంటే.. మరికొందరు మాత్రం వారి పై నెగిటివ్ కామెంట్స్ చేస్తూ వారిని విసిగిస్తున్నారు. ఇలా నెగిటివ్ కామెంట్స్ చేసేవారిపై నటీమణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అనసూయ, రష్మీ వంటి వారు అనేక సార్లు అభిమానుల పై ఫైర్ అయిన సందర్భాలు ఉన్నాయి.

ఇదిలా ఉంటే.. తాజాగా మరో ఇద్దరు హీరోయిన్లు కూడా కొంచెం ఘాటుగానే రిప్లై ఇచ్చారు. ఆ హీరోయిన్లు మరెవరో కాదు. పూనమ్ కౌర్, వరలక్ష్మీ శరత్ కుమార్ లు. ఇటీవల వరలక్ష్మి బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. దానికి ఓ నెటిజెన్.. ‘ఈ బర్త్ డే తో 35 ఏళ్లు నిండాయా ఆంటీ’ అంటూ కామెంట్ చేశాడు. దానికి వరలక్ష్మీ ‘అవును.. అయితే ఏంటి అంకుల్’ అంటూ ఘాటుగా కౌంటర్ ఇచ్చింది.

పలు సినిమాల్లో నటించిన పూనమ్ కౌర్ ను సైతం కొందరు నెటిజన్లు ఇలా కౌంటర్ లు వేసే ప్రయత్నం చేశారు. ఆమె పోస్ట్ చేసిన ఓ ఫొటోను ‘వావ్ అదిరిపోయింది ఆంటీ’ అంటూ కామెంట్ చేశాడు. దానికి పూనమ్… ‘థ్యాంక్యూ అంకుల్’ అంటూ స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది. అయితే సెలబ్రిటీలపై ఈ విధంగా కామెంట్స్ చేయడం కరెక్ట్ కాదని మరికొంతమంది నెటిజన్లు అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -