Wednesday, April 24, 2024
- Advertisement -

శ్వేతాబసుకు లైఫిస్తున్న స్టార్ విలన్…!

- Advertisement -

వివాదాస్పద హీరోయిన్ శ్వేతాబసు కు లైఫిస్తున్నాడు ఈగ విలన్ సుదీప్. ఈ స్టార్ విలన్ తన కన్నడ సినిమా ఒకదాంట్లో ఆమెతో ఒక ఐటమ్ సాంగ్ చేయిస్తున్నాడు. మరి ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న శ్వేతకు ఇది మంచి ఛాన్సే అనుకోవాలి.

శ్వేత ఎందుకు ఇబ్బందుల్లో పడిందో వేరే చెప్పనక్కర్లేదు. వ్యభిచారంలో ఆమె పట్టుబడింది. స్టింగ్ ఆపరేషన్ లో తన ధరను కూడా చెప్పుకొని శ్వేత వివాదాల్లో కూరుకుపోయింది. ఆ తర్వాత కొంత కాలం స్టేట్ హోమ్ లో గడిపింది. ఇప్పుడు బయటకు వచ్చి.. తను సినిమాల్లో చేసుకుంటోంది. తెలుగులో ఒకటీ రెండు సినిమాల్లో అవకాశాలు సంపాదించుకొంది.

‘కొత్తబంగారులోకం’ తో  తెరపైకి వచ్చింది శ్వేత. యూత్ ఫుల్ లవ్ స్టోరీతో మంచి పేరు తెచ్చుకొంది. ఆ తర్వాత తెలుగులో చాలా అవకాశాలే వచ్చాయి. కానీ సరైన హిట్ లేకపోవడం ఈ బెంగాలీ భామను ఇబ్బంది పెట్టింది. చిన్న వయసులోనే తెరకు పరిచయం అయిన శ్వేత హీరోయిన్ గా ఫేమ్ వచ్చాకా వ్యభిచారంలో కూరుకుపోయింది. పట్టుబడి ఇబ్బంది పడింది.

ఇలాంటి నేపథ్యంలో సుదీప్ ఆమెకు ఐటమ్ సాంగ్  ఛాన్సిచ్చాడు. ఇది శ్వేత కెరీర్ కు కొంత ప్లస్ పాయింటే. ఎలాగూ కన్నడలో సుదీప్ స్టార్ హీరో. అతడి సినిమాతో గనుక మంచి పేరు వస్తే ఆమెకు మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం ఉంది. మరి ముందు.. ముందు శ్వేత కెరీర్ ఎలా ఉంటుందో చూడాలి. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -