శ్రీముఖి అంటే సుధీర్ కి ఎందుకు కోపం ?

10224
Sudigali sudheer About Sreemukhi
Sudigali sudheer About Sreemukhi

జబర్దస్త్ ద్వారా సుడిగాలి సుధీర్ బాగా పేరు తెచ్చుకున్నాడు. ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి.. జబర్దస్త్ లో టీం లీడర్ గా ఎదిగాడు. ప్రస్తుతం జబర్దస్త్ లో టాప్ టీం లీడర్ గా కొనసాగుతున్నాడు. అయితే ఇటివలే సుధీర్ హీరోగా సాఫ్ట్ వేర్ సుధీర్ అనే సినిమాలో నటించాడు. ఇదే ఇతనికి హీరోగా మొదటి సినిమా. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో సుధీర్ పాల్గొన్నాడు.

తాను ఒక సాధరణ స్థాయి ఆర్టిస్టు నుంచి హీరోగా ఎదగడం వెనక చాలా కష్టం ఉందని.. తనకు సినీ పరిశ్రమలో ప్రవేశించేందుకు మెగాస్టార్ చిరంజీవే స్పూర్తి అని సుధీర్ చెప్పాడు. ఈ సందర్భంగా బిగ్ బాస్ షో గురించి సుధీర్ ను ప్రశ్నించగా.. వెంటనే మాట దాటవేశాడు. తాను అసలు బిగ్ బాస్ షో చూడలేదని.. దాని గురించి తనకేం తెలియదు అని చెప్పాడు. రాహుల్ కి సుధీర్ కి పెద్దగా పరిచయాలు లేవు. కానీ సుధీర్, యాంకర్ శ్రీముఖి కలిసి చాలా షోస్ చేశారు.

అయినప్పటికి శ్రీముఖి ఎవరో తెలియదు అన్నట్లు వ్యవహరించాడు. తనతో పాటు కెరీర్ మొదలు పెట్టిన శ్రీముఖి బిగ్ బాస్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ, సుధీర్ తనకేమి పట్టనట్లు కనీసం స్పందించేందుకు నిరాకరించడంపై శ్రీముఖి ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. శ్రీముఖి అంటే సుధీర్ కి ఎందుకు పడటం లేదు అన్న యాంగిలో నెటిజన్లు అలోచిస్తున్నారు.

Loading...