రష్మీని వదిలేసి వర్షిణితో రొమాన్స్ చేస్తున్న సుధీర్..!

1256
sudigali sudheer and varshini sounderajan romantic act in dhee
sudigali sudheer and varshini sounderajan romantic act in dhee

కమెడియన్‌గా, టీమ్ లీడర్‌గా, యాంకర్‌గా సూపర్ ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు సుడిగాలి సుధీర్. వరుస ఆఫర్స్ తో బిజీగా ఉన్నాడు. రష్మీ గౌతమ్ కూడా సుధీర్ కి మించి క్రేజ్ ఉంది. జబర్ధస్త్ అనే కామెడీ షో ద్వారా తెలుగు వాళ్లకు పరిచయం అయిన ఈ ఇద్దరూ… జంటగా పాపులర్ అయ్యారు. ఈ క్రమంలోనే వీళ్లపై ఎన్నో పుకార్లు షికార్లు చేశాయి. కొద్ది రోజుల క్రితం సుధీర్… ‘నేను ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి రష్మీనే కారణం. ఆమె వల్లే నేను మరింత ఫేమస్ అయ్యాను’ అని చెప్పుకొచ్చాడు.

కానీ తమ మధ్య ప్రేమ లేదని జస్ట్ ఫ్రెండ్స్ మాత్రమే అని చెప్పాడు. అయితే షోలో మాత్రం రష్మీ గౌతమ్‌తో రొమాన్స్ పండిస్తూ రోజు రోజుకూ ఫుల్ ఫేమస్ అయిపోతోన్న సుడిగాలి సుధీర్… దాన్ని కంటిన్యూ చేసేలా తరచూ ఏదో ఒక కామెంట్ చేస్తూనే ఉన్నాడు. ఆమెతో కలిసి ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. దీంతో వీళ్లిద్దరూ పెళ్లి పీటలెక్కబోతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ జబర్ధస్త్ కమెడియన్ సడన్‌గా ట్రాక్ మార్చేశాడు. రష్మీతో ఎన్నోసార్లు రొమాంటిక్ డ్యాన్స్ చేసి మెప్పించాడు సుధీర్. తాజాగా అతడు ఆమెను వదిలేసి మరో హాట్ యాంకర్ వర్షిణితో ట్రాక్ కలిపాడు.

వచ్చే వారం ప్రసారం కానున్న ఢీ షో ప్రోమోలో ఇది ప్రత్యక్షమైంది. ఇందులో రష్మీ ముందరే ఆమెతో రొమాంటిక్ డ్యాన్స్ చేసి ఆకట్టుకున్నాడు. వర్షిణి కూడా సుధీర్‌తో కలిసి కాళ్లు కదిపింది. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. ఇక కొద్ది రోజుల క్రితం ఓ యూట్యూబ్‌ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చింది వర్షిణి.. ఆ సమయంలో సుధీర్‌తో ఎఫైర్ గురించి ఓ ప్రశ్న ఎదురైంది. దీనికి స్పందిస్తూ… ‘సుధీర్ నాకు ఫ్యామిలీ ఫ్రెండ్. అతడిని నేను బ్రో బ్రో అని పిలుస్తుంటా. తను కూడా నన్ను బ్రో అంటాడు. బ్రదర్ సిస్టర్ రిలేషన్ ఉన్న మా ఇద్దరికి పెళ్లి అంటే ఎలాగో అనిపిస్తుంది’ అని ఆమె చెప్పుకొచ్చింది.

Loading...