సుడిగాలి సుధీర్ మ్యారేజ్ ఫిక్స్ అయింది ?

1206
Sudigali Sudheer Marriage Fixed
Sudigali Sudheer Marriage Fixed

సుడిగాలి సుధీర్ కి బుల్లితెరపై ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. జబర్దస్త్ ద్వారా మంచి కమెడియన్ అనిపించుకున్న సుధీర్ ఢీ జోడి, పోవే పోరా వంటి షోల్లో కూడా యాంకర్ గా రాణిస్తున్నాడు. అయితే బుల్లితెరపై సుధీర్, రష్మీ ల మధ్య ఏదో ఉందని ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉంటాయి. వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని కుడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలను వీరిద్దరు ఎప్పటికప్పుడు ఖండించి.. మేము జస్ట్ ఫ్రెండ్స్ అని మాత్రమే చెప్పిన ఈ వార్తలు ఆగడటం లేదు.

ఈ విషయం పై రష్మీ కూడా నెటిజెన్ల పై ఫైర్ అయ్యి అయ్యి అలిసిపోయింది. ఈ వార్తలకు సుధీర్ బ్రేక్ వేయ్యాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా టాలీవుడ్ లో యంగ్ హీరోలు, ఆర్టిస్ట్ లు పెళ్ళి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే హీరో నిఖిల్, కమెడియన్ మహేష్ పెళ్లి చేసుకున్నారు. ఇక హీరోలు నితిన్, రానా కూడా పెళ్లికి రెడీ అవుతున్నారు. అయితే మాములు టైంలో సుధీర్ చాలా బిజీగా ఉంటాడు. ఇప్పుడు లాక్ డౌన్ వల్ల ఖాళీ దొరికింది కాబట్టి పెళ్ళి చేసుకోవడానికి రెడీ అయ్యాడట.

ఈ విషయంలో అతని స్నేహితులు గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ లు కూడా సుధీర్ కు మంచి మ్యాచ్ కోసం తెగ ట్రై చేశారట. చివరికి ఓ మ్యాచ్ ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. అమ్మాయి సుధీర్ కు నచ్చడం ఇక జాతకం స్కోర్ కూడా బాగా మ్యాచ్ అవ్వడంతో.. ఇక ఏమాత్రం ఆలోచించకుండా ఓకే చెప్పేశాడట. ఇక అమ్మాయిది కూడా కృష్ణా జిల్లానే అని తెలుస్తుంది. సుధీర్ కు దగ్గర బంధువుల అమ్మాయి అని తెలుస్తుంది. తొందర్లోనే సుధీర్ పెళ్లి జరిగే అవకాశం ఉందట.

Loading...