Saturday, April 20, 2024
- Advertisement -

అక్కడ ఆమెతో.. ఇక్కడ ఈమెతో.. జబర్ధస్త్ లో రష్మీతో.. సుధీర్ పండగ చేసుకుంటున్నాడు

- Advertisement -

సుడిగాలి సుధీర్.. జబర్ధస్త్ లో వేణు టీంలో కమెడియన్ గా చేసి.. ఆ తర్వాత వేణు టీం నుంచి వెళ్లిపోవడంతో.. జబర్ధస్త్ లో టీం లీడర్ అయిపోయాడు. అతి తక్కువ కాలంలో మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే సుధీర్ జబర్ధస్త్ షోతో పాటు.. ఇటివలే డీ ప్రోగ్రోంతో పాటు పోవే పోరా అనే షోలో కూడా చేస్తున్నాడు.

ఇవే కాకుండా అప్పుడు అప్పుడు సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రలు చేస్తున్నాడు. అయితే సుధీర్ కి, యాంకర్ రష్మీకి మధ్య ఎఫైర్ ఉన్నట్లు రోజుకో వార్త వస్తున్నా విషయం తెలిసిందే. ఈ విషయంపై సుధీర్, రష్మీలు చాలా సార్లు క్లారిటీ ఇచ్చినా ఆ వార్తలు అసలు ఆగలేదు. అయితే సుధీర్ పంచులు వేయడంలో బాగా ముదురు అని అందరికి తెలిసిందే. తాజాగా సుధీర్ చేస్తున్న పోవే పోరా.. ప్రోగ్రాంలో లేడీ యాంకర్ విష్ణుప్రియాను ఓ ఆట ఆడుకుంటున్నాడు. ఆమె భూజాల వరకు ఉండే సుధీర్ ఆమె మీద పన్నీ పన్నీ జోకులు వేస్తూ బుల్లితెర ప్రేక్షకులను తెగ నవ్విస్తున్నాడు. విష్ణు ప్రియా యాంకరింగ్ కి కొత్త కావడంతో ఒక్కటి రెండు పంచులు తప్పిస్తే పెద్దగా రివర్స్ లో వేయలేకపోతుంది. ఇది ఇలా ఉంటే డీ లో కొత్తగా వచ్చిన మరో యాంకర్ వర్షిని ని కూడా సుధీర్ ఓ ఆట ఆడుకుంటున్నాడు.

ఆమె కూడా యాంకరింగ్ కి కొత్త కావడంతో.. పంచ్ లు వేయడానికి టైం తీసుకుంటుంది.. దీంతో మనోడు షోలో యాంకర్ ని ఓ ఆట ఆడేస్తూ.. అందరిని నవ్విస్తున్నాడు. ఇక జబర్ధస్త్ విషయంలో రష్మీ మీద పంచులు వేసినా.. ఆమె తిరిగి ఏదో ఒక పంచ్ వేస్తాది కాబట్టి.. ఆమె పై సుధీర్ పంచులు వేయడం తగ్గించాడు. ఏది ఏమైనా సుధీర్.. పోవే పోరాలో విష్ణు ప్రియాతో.. డీలో వర్షినితో.. జబర్ధస్త్ లో రష్మీతో ఒక ఆట ఆడుకుంటున్నాడు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -