పుష్ప కోసం పాత పద్ధతినే సుకుమార్ ఫాలో అవుతున్నడా..!!

856
sukumar pushpa update
sukumar pushpa update

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరో గా పుష్ప సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా కి కాపీ ఆరోపణలు వచ్చినా వాటిని దాటుకుని ఈ సినిమా శేరవేగంగా ప్రేక్షకులను మెప్పించడానికి వస్తుంది.. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కొనసాగుతుందని చెప్పిన ఈ సినిమా లో బన్నీ ఇంతకు ముందెన్నడూ కనిపించని విధంగా కనిపించబోతున్నాడు.. ఇప్పటికే ఈ సినిమా ఫస్ట్ లుక్ అందరికి నచ్చేసింది.. పోస్టర్ లోనే వెరైటీ చూపించిన సుకుమార్ సినిమాలో మరింత వేరియేషన్స్ ని చూపిస్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదని ప్రేక్షకులు చెప్తున్నారు. 

ఇక వీరి కాంబినేషన్ లో వస్తున్న మూడో సినిమా కాగ గతంలో వచ్చిన ఆర్య, ఆర్య2 సినిమాలు ఓ రేంజ్ లో హిట్ కావడంతో ఈ క్రేజీ కాంబినేషన్ పై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడ్డాయి.. యా అంచనాలకు తగ్గట్లే ఈ సినిమా లో కాస్టింగ్ ని చేస్తున్నారట సుకుమార్.. ఈ సినిమా లో ఇప్పటికే విలన్ గా జగపతిబాబు ను ఫిక్స్ చేయగా రష్మిక మందన్న హీరోయిన్ గా ఎంపిక అయ్యింది. ఇక ఈ సినిమా మొత్తం చిత్తూర్ స్లాంగ్ లో సాగుతుందట. దేవిశ్రీ పాటలు ఇక చెప్పనవసరం లేదు.. 

సుక్కు దేవి కాంబోలో వచ్చిన ఐటెం సాంగ్స్ ని మించిపోయే రీతిలో దీంట్లో కూడా ఒకటి ప్లాన్ చేశారట. ఓ బాలీవుడ్ బ్యూటీ కోసం గట్టిగానే ట్రై చేస్తున్నారు కానీ ఇంకా ఆ ప్రయత్నాలు ఓ కొలిక్కి రాలేదని వినికిడి. రంగస్థలం లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత మూడేళ్ళ  గ్యాప్ ని చవి చూసిన సుకుమార్, అల వైకుంఠపురములోతో ఆల్ టైం బ్లాక్ బస్టర్ అందుకున్న అల్లు అర్జున్ కలయికలో రాబోతున్న పుష్ప ఓ రేంజ్ లో మాత్రం ఉండబోతుందట.. ఇక మరో పక్క అల్లు అర్జున్ తర్వాతి సినిమా కోసం అంత సిద్ధమవుతుంది.. కొరటాల శివ ఈ సినిమా కి దర్శకుడు.. దీంట్లో దిశా పటాని హీరోయిన్ గా నటించబోతుండగా మణిశర్మ సంగీతం వహిస్తారని అంటున్నారు.. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కనుందట..

Loading...