Thursday, March 28, 2024
- Advertisement -

పెళ్లికి రెడీ అవుతున్న యంగ్ హీరో సందీప్ కిషన్..?

- Advertisement -

ఈ లాక్ డౌన్ లో ఇటివలే హీరో నిఖిల్, ‘రంగస్థలం’ మహేష్, నిర్మాత దిల్ రాజు వంటి వారు పెళ్లిల్లు చేసుకున్న విషయం తెలిసిందే. ఇక నితిన్, రానా కూడా త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. నితిన్ పెళ్లి అయితే ఏప్రిల్ లోనే జరగాల్సింది.. కానీ వైరస్ మహమ్మారి వల్ల వాయిదా పడింది. ఇక రానా పెళ్లి ఆగష్ట్ 8న ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. ఇంకా ఎంతో మంది టాలీవుడ్ నటీనటులు కూడా పెళ్లిళ్లు చేసుకోవడానికి రెడీ అవుతున్నారని టాక్.

ఒక్కసారి షూటింగ్స్ మొదలైతే మళ్లీ ఖాళీ టైం దొరికే ఛాన్స్ ఉందదు. కాబట్టి ఫ్రీ టైంలో పెళ్లి చేసుకుంటే ఓ పనైపోతుందని చాలా మంది నటీనటులు భావిస్తున్నారట. ఈ లిస్ట్ లో తాజాగా సందీప్ కిషన్ కూడా చేరినట్టు తెలుస్తోంది. ఇప్పటికే పిల్లని వెతికే పనిలో అతనికి కుటుంబ సభ్యులు బిజీగా ఉన్నట్టు సమాచారం. సందీప్ కిషన్ వయసు కూడా 33 ఏళ్ళు.టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లో ఇతను కూడా ఒకడు.

పైగా ప్రముఖ సినిమాటోగ్రఫర్ చోటా కె నాయుడు మేనల్లుడు కాబట్టి ఇతని పై కూడా ఫోకస్ ఎక్కువగానే ఉంది. ఇక సందీప్ తెలుగులోనే కాదు తమిళంలో కూడా సినిమాలు చేస్తున్నాడు. ఇతని సినిమాలు ఏడాదికి కనీసం రెండు అయిన రిలీజ్ అవుతూ ఉంటాయి. అందుకే షూటింగ్స్ పూర్తిసాయిలో మొదలు కాకముందే పెళ్లి చేసుకుంటే బెటర్ అని భావిస్తున్నాడట. ఇక అతనికి కాబోయే భార్య.. ‘స్మార్ట్, స్ట్రాంగ్ మరియు స్ఫూర్తిని ఇచ్చే అమ్మయి’ అయ్యి ఉండాలని.. సందీప్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. మరి అలాంటి అమ్మాయి సందీప్ కి త్వరగా దొరకాలి అని కోరుకుందాం.

బెడ్ రూమ్ సీన్లు చేసి పెద్ద తప్పు చేశా : ఆండ్రియా

యాంకర్ అనసూయ ఆస్తి ఎంతో తెలుసా ?

హీరో నాగశౌర్యపై పంచ్ వేసిన హీరో నితిన్..!

మహేష్, వంశీ పైడిపల్లి సినిమా ఆగిపోవడానికి కారణం ఇదే..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -