ప్రముఖ రాజకీయ నాయకుడి పాత్ర లో సునీల్ ?

668
Sunil To Act As A Politician KA Paul..?
Sunil To Act As A Politician KA Paul..?

గత కొద్దీ రోజుల ముందు ఆంధ్ర ప్రదేశ్ లో జరిగిన ఎన్నికల్లో అందరికన్నా ఎక్కువ గా జనాలని ఆకట్టుకున్న నాయకుడు కె ఏ పాల్. ప్రజా శాంతి పార్టీ పేరు తో పాల్ వేసిన గెంతులు అన్నీ ఇన్నీ కావు. పాల్ లేకుంటే ఎన్నికలు చాలా బోరింగ్ గా ఉండేవి అని అందరూ అంటున్నారు అంటే అర్ధం చేసుకోవచ్చు. ఇకపోతే ప్రస్తుత పరిస్థితుల్లో పాల్ మాత్రం ఎక్కడా కనిపించడం లేదు. అయితే మన తెలుగు దర్శక నిర్మాతలు పాల్ పాత్ర ని బేస్ చేసుకొని ఒక సినిమా చేయాలి అని అనుకుంటున్నారు. అయితే పాల్ పాత్ర ని పాపులర్ కమెడియన్ సునీల్ పోషిస్తాడని టాక్ నడుస్తుంది.

ఒక పేరున్న నిర్మాణ సంస్థ ఈ విషయమై సునీల్ ని కూడా అప్రోచ్ అయినట్టు తెలుస్తుంది. ఈ సినిమా ద్వారా ఒక నూతన దర్శకుడు తెలుగు కి పరిచయం అయ్యే అవకాశం ఉంది. పాల్ పాత్ర ని దృష్టి లో ఉంచుకొని ఈ సినిమా కి కథ ని తయారు చేశారట. అయితే ఈ సినిమా త్వరలో నే సెట్స్ కి వెళ్లనుంది.

సినిమా కి సంబందించిన అధికారిక ప్రకటన,మరిన్ని వివరాలు త్వరలో తెలియాల్సి ఉంది.

Loading...