Friday, March 29, 2024
- Advertisement -

మహేష్ బాలీవుడ్ ఎంట్రీ సంగతి ఏమైంది?

- Advertisement -

టాలీవుడ్ లోని స్టార్ హీరోల జాబితాలో సూపర్ స్టార్ మహేష్ బాబు పేరు ముందే ఉంటుంది. తెలుగులో మాత్రమే కాక మహేష్ బాబు కి బాలీవుడ్ లో కూడా మంచి పేరే ఉంది. యూట్యూబ్ పుణ్యమా అని మహేష్ బాబు కి నార్త్లో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. అక్కడి మహేష్ బాబు అభిమానులు అందరూ మహేష్ బాలీవుడ్ లో ఎప్పుడు హీరోగా అడుగుపెడతాడు అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కానీ మహేష్ బాబు మాత్రం తన బాలీవుడ్ డెబ్యూ గురించి ఇంకా ఆలోచించకపోవడం అందరినీ నిరాశకు గురి చేస్తోంది.

అయితే మహేష్ బాబు బాలీవుడ్ పై అంత ఆసక్తి చూపించకపోవడం నికి గల కారణాల్లో ఒకటి సరైన దర్శకుడు మరియు కథ దొరకకపోవడం. ఒకవేళ ఎస్ ఎస్ రాజమౌళి, ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో సినిమాలు చేస్తే మహేష్ బాబుకి బాలీవుడ్ ఎంట్రీ కూడా సులువు అవుతుంది. మరి ‘ఆర్ఆర్ఆర్’ సినిమా పూర్తయిన తర్వాత అయినా రాజమౌళి మహేష్ తో సినిమా చేస్తారా లేదా అని ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు కేజీఎఫ్ దర్శకుడు కూడా కొందరు స్టార్ హీరో లతో సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదేమైనా మహేష్ బాబు బాలీవుడ్ డెబ్యూ సినిమా గురించి ఏదైనా అప్డేట్ తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -