Thursday, April 25, 2024
- Advertisement -

పంచెకట్టులో అదరగొట్టిన సూరేఖా ఆంటీ..!

- Advertisement -

సురేఖా వాణి.. తెలుగు సినీ ప్రేక్షకులకు బాగా తెలిసిన పేరు. ఈమెను ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. టాలీవుడ్ లో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాల్లో నటించింది. తల్లిగా అక్కగా అత్తగా నటించి మెప్పించింది. అంతేకాకుండా కమెడీయన్స్ పక్కన జోడిగా నటించి బాగా నవ్వించింది. తెలుగు – తమిళ చిత్రాల్లో నటిస్తున్న ఈ నటి.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. అటు వెండితెరతో పాటు బుల్లితెరపై కూడా సంచలనాలు సృష్టించిన సురేఖావాణికి నెటిజన్లలో మంచి క్రేజ్ ఉంది.

టైం ఉన్నప్పుడల్లా తన కూతురితో కలిసి డాన్స్ చేస్తూ ఆ వీడియోలను తన ఇంస్టాగ్రామ్ పోస్ట్ చేస్తూ ఉంటుంది. నాలుగు పదుల వయసు దాటిపోయినా.. పెళ్లీడుకొచ్చిన కూతురు ఉన్నా సురేఖా ఆంటీ జోరు మాత్రం తగ్గించడం లేదు. తన కూతురికి పోటీగా పొట్టి పొట్టి బట్టలు వేస్తూ ఈ వయసులో కూడా వయలుపోతూ ఉంటుంది. కూతురుతో పాటు ఆమె కూడా అందాలు ఆరబోయడానికి రెడీ అయిపోయి రచ్చ రచ్చ చేస్తుంటుంది.

ఇంతకు ముందు బాత్ టబ్ లో ఫోటోను షేర్ చేసిన సురేఖా.. ఇప్పుడు తాజాగా పెట్టిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో తన కూతురు సుప్రీతతో కలిసి పంచె కట్టులో దర్శనమిచ్చింది. డార్క్ బ్లూ కలర్ షర్ట్ ధరించి.. పంచె కట్టు పైకి లేపి.. గ్లాసెస్ పెట్టుకొని ర్యాంప్ వాక్ చేసింది. ‘ఢిల్లీ – 6’ సినిమాలని ‘గేందే పూల్’ సాంగ్ ప్లే అవుతుండగా ఈ తల్లీకూతుళ్లు ఒకరికి మించి ఒకరు వయ్యారాలు పోతూ వాక్ చేసారు. తన కూతురి కంటే తానేం తక్కువ కాదని నిరూపించుకునే ప్రయత్నం చేసింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు.. సురేఖా ఆంటీకి సమ్మర్ లో చీరకట్టు కంటే పంచె కట్టు సుఖంగా ఉందేమో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడు పంచె కట్టులో దర్శనమిచ్చిన ఆంటీ నెక్స్ట్ ఎలాంటి లుక్ తో బయటకి వస్తుందో అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న సురేఖ.. తన కూతురుతో కలిసి హీట్ పెంచే వీడియోలను చేస్తోంది. ఇప్పుడు ఆ వీడియో వైరల్ అయింది. మీరు చూసేయండి.

https://www.instagram.com/p/B_7F2_uA1CL/

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -