Wednesday, April 24, 2024
- Advertisement -

భర్త చనిపోయాడని.. మగాడితో కనిపిస్తే లింక్ పెట్టారు : సురేఖ వాణి

- Advertisement -

సురేఖ వాణి అంటే గుర్తుపట్టని తెలుగు ప్రేక్షకులు ఉండరు. మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ ఆమె ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. అక్కగా, వదినగా, భార్యగా.. ఇలా ఏ పాత్ర చేసినా తనకంటూ ఓ గుర్తింపు ఉండేలా చూసుకున్నారు. రెడీ, బాద్‌షా, ద్వారకా, శమంతకమణి, పిల్ల నువ్వులేని జీవితం, రారండోయ్‌ వేడుక చూద్దాం వంటి సినిమాలో నటించిన ఈమె.. ఈ మధ్య సినిమాల్లో ఎక్కువగా కనిపించడం లేదు.

ఈమెకు ఎక్కువగా హీరోలకు తల్లి పాత్రల్లో నటించాలని ఆఫర్స్ వస్తుండటంతో.. సురేఖ ఆ ఆఫర్స్ ని అంగీకరించడం లేదు. దాంతో ఈమెకు ఇప్పుడు ఎక్కువగా ఆఫర్స్ రావడం లేదు. అయినప్పటికి ఈమె ఈ మధ్య ఎక్కువ వార్తల్లో నిలుస్తున్నారు. సురేఖ ఈ మధ్య సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. చిట్టిపొట్టి బట్టలు వేసుకొని ప్రేక్షకుల మతి పోగొడుతోంది. తన కూతురు సుప్రియతో కలిసి తీసుకున్న ఫొటోలు, వీడియోలను షేర్ చేస్తోంది.

కూతురును హీరోయిన్‌ చేసేందుకు ఆమెను తెరపైకి తెస్తోందని అంతా అనుకుంటున్నారు. అదే టైంలో తల్లి పాత్రలు చేసేందుకు తన వయసేం అయిపోలేదని చెప్పే ప్రయత్నం చేస్తోందట. తన కూతురుకు పోటీగా అన్నట్టు పొట్టి దుస్తులు ధరించి గ్లామర్ ఒలకబోస్తోంది. దాంతో, సోషల్‌ మీడియాలో ఆమెకు ఫాలోవర్లు బాగానే పెరిగారు. సోషల్‌మీడియాలో సురేఖ ఫోటోలు చూసి రకరకల కామెంట్లు చేస్తున్నారు. అవి సురేఖకు విసుగు తెప్పిస్తున్నాయి. తన పక్కన ఎవరు ఉన్నా తప్పుగా ప్రచారం జరుగుతోందని ఆమె వాపోతోంది.

తన గురించి సోషల్‌ మీడియా, ఇతర మాధ్యమల్లో వస్తున్న పుకార్ల గురించి సురేఖ స్పందించింది. తన పక్కన కనిపించిన ప్రతి ఒక్క వ్యక్తితో తనకు లింక్ పెడుతున్నారని బాధ పడుతోంది. ప్రధానంగా తన భర్త చనిపోయిన తర్వాత ఇది ఎక్కువైందని ఆమె వాపోతుంది. . ‘నా పక్కన ఒక పురుషుడు కనిపిస్తే చాలు కథలు అల్లేస్తున్నారు. నాతో ఉన్నది నా కజినా, సోదరుడా? తండ్రా? అని కనీసం క్రాస్‌ చెక్‌ కూడా చేసుకోవడం లేదు’ అని చెప్పింది. తన పక్కన మగాడు కనిపిస్తే సంబంధం అంటగట్టారని చెప్పింది. అయితే వీటిని పట్టించుకోవడం మానేసనని చెప్పింది.

నటి రమప్రభ అల్లుడు తెలుగు హీరో అని మీకు తెలుసా ?

నాతో తిరిగిన వాళ్లే నన్ను తేడా అని అవమానించారు : జబర్దస్త్ పవన్

రణబీర్ రేపిస్ట్.. దీపికా సైకో.. కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు

రానా, మిహీకా మెహిందీ ఫంక్షన్ సమంత వేసుకున్న డ్రెస్ ధర ఎంతంటే ?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -