Friday, March 29, 2024
- Advertisement -

ఈ వయసులో కూడా రెచ్చిపోతున్న సురేఖావాణి..!

- Advertisement -

టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా సురేఖావాణికి మంచి పేరు ఉంది. ఆమె ఎన్నో సినిమాల్లో అక్కగా, అమ్మ, అత్తగా నటించి ప్రేక్షకుల చేత ప్రశంసలు పొందింది. ప్రస్తుతం ఆమె ఎక్కువగా సినిమాల్లో కనిపించడం లేదు. అవకాశాలు కూడా పెద్దగా రావడం లేదని తెలుస్తోంది.

కానీ వెండితెరపై వేసే పాత్రలకు అపోజిట్‌గా తన ఇమేజ్‌ని సోషల్ మీడియాలో బిల్డప్ చేసుకుంటోంది సురేఖావాణి. తన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసేస్తూ రచ్చరచ్చ చేస్తోంది. తెరపైన చీరకట్టులో కనిపిస్తూ సాంప్రదాయంగా ఉండే సురేఖ.. సోషల్ మీడియాలో మాత్రం గ్లామర్ ఫోటోలను గుప్పిస్తోంది. అలానే ఆ మధ్య బికీనీ వేసుకుని స్విమ్మింగ్ ఫూల్ లో దిగి తన అందాలను ప్రదర్శించింది. ఆ ఫోటో కాస్త అప్పట్లో వైరల్ అయ్యింది.

ఇప్పుడు రకరకాల డ్రెస్సులతో యువతను ఉర్రూతలూగించేలా ఆమె వేస్తున్న డ్రస్సులు.. తీసుకున్న ఫోటోలను చూసి కుటుంబ పాత్రల్లో చూసిన ఫ్యామిలీ ప్రేక్షకులు మాత్రం షాక్ అవుతున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె చేస్తున్న పాత్రలు పెద్ద హీరోల సినిమాలే కావడంతో ఆమెకు బాగానే కలిసి వస్తోంది. సో ఆమె కాస్త ఖాళీ దొరికిన సమయంలో ఇలా ఫోటో షూట్ లకు రెడీ అవుతోంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -