Thursday, April 18, 2024
- Advertisement -

తెరపైకి ఉదయ్ కిరణ్ బయోపిక్..హీరోగా ఆయ‌నే

- Advertisement -

ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో బ‌యోపిక్‌ల హ‌డ‌విడి కనిపిస్తుంది.మ‌హ‌న‌టి,ఎన్టీఆర్, వైఎస్‌ఆర్ , ఇలా అంద‌రు బ‌యోపిక్‌ల బాట పట్టారు.టాలీవుడ్‌లో ఇప్పుడు మ‌రో క్రేజి బ‌యోపిక్‌కి రంగం సిద్ధం అవుతుంది.ఇండస్ట్రీలో  స్వయం కృషితో అతి తక్కువ కాలంలోనే టాప్ హీరో రేంజ్‌కి ఎదిగిన ఉదయ్ కిరణ్ జీవితం అర్ధాంతరంగా ముగిసింది. 37 ఏళ్ల వయసులోనే ఉదయ్ కిరణ్ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూశారు.విజయాలు, అపజయాలు, నిందలు, అవమానాలు ఎన్నో ఉన్నాయి.

ఉదయ్ కిరణ్ చిత్రం సినిమాతో ఇండ‌స్ట్రీకి ప‌రిచియం చేశాడు ద‌ర్శ‌కుడు తేజ‌.ఆ తరువాత ఉదయ్ కిరణ్ వరుసగా.. నువ్వు – నేను, మనసంతా నువ్వే చిత్రాలతో హ్యాట్రిక్ హిట్‌లను అందుకుని లవర్ బాయ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు.ఉదయ్ కిరణ్ దగ్గ‌ర ఉండి గ‌మ‌నించిన ద‌ర్శ‌కుడు తేజ తన బ‌యోపిక్‌కు రంగం సిద్ధం అవుతున్నాడు. ఇలా ఉదయ్ కిరణ్‌తో పనిచేసిన దర్శకుల్లో తేజతో ప్రత్యేక అనుబంధం ఉంది. ఉద‌య్ కిర‌ణ్‌ను చాలా ద‌గ్గ‌ర ఉండి గ‌మ‌నించాడు తేజ.

వ్యక్తిగతంగా కూడా ఉదయ్ కిరణ్ కొన్ని పర్సనల్ విషయాలను తేజతో పంచుకున్నట్లు సమాచారం.వీటి ఆధారంగా ఉదయ్ కిరణ్ బయోపిక్ తేజ తన సొంత నిర్మాణంలో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం అందుతోంది. ఇక ఈ సినిమాలో హీరోగా త‌ను ప‌రిచియం చేసిన న‌వ‌దీప్‌ను తీసుకొవాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్నాడు ద‌ర్శ‌కుడు తేజ‌.మ‌రి న‌వ‌దీప్ ఉదయ్ కిరణ్ బయోపిక్‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇస్తాడో లేదో చూడాలి.

https://www.youtube.com/watch?v=bnQNA8GntRY

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -