థమన్ కు ఎంత వయసు కొడుకున్నాడో తెలుసా ?

642
Thaman having 14 years old child
Thaman having 14 years old child

ప్రస్తుతం తన మ్యూజిక్ తో తమిళ, తెలుగు భాషాల్లో సంచలనం సృష్టిస్తున్నాడు థమన్. దాంతో ఆయనకు భారీ డిమాండ్ తో పాటు భారీ క్రేజ్ పేరిగిపోయింది. వరసబెట్టి హిట్స్ కొడుతున్నాడు. ‘వెంకీమామ’ ‘ప్రతీరోజూ పండగే’ ‘అల వైకుంఠపురములో’ వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లను సొంతం చేసుకున్నాడు. ప్రధానంగా.. ‘అల వైకుంఠపురములో’ ఆల్బమ్ ఓ మాస్టర్ పీస్ అనే చెప్పాలి. ఈ సినిమాలోని పాటలు దేశవ్యాప్తంగా పాపులర్ అయ్యాయి.

ఇందులోని బుట్టబొమ్మ సాంగ్ కు సెలబ్రిటీలు సైతం టిక్ టాక్ చేశారు. అయితే గతంలో థమన్ పాటలకు ట్రోలింగ్ ఎక్కువ జరిగేది అన్న విషయం తెలిసిందే. కొట్టిన ట్యూన్ పదిసార్లు కొడుతాడనే విమర్శలు వచ్చేవి. అంతేకాకుండా కాపీ కొడుతాడని విమర్శలు కూడా వచ్చాయి. అయితే ‘తొలిప్రేమ'(2018) చిత్రం నుండీ రూటు మార్చి మంచి సంగీతం ఇస్తూ వస్తున్నాడు. ఇదిలా ఉంటే.. తమన్ పర్సనల్ లైఫ్ గురించి ప్రేక్షకులకు ఎక్కువగా తెలీదు. తమన్ భార్య పేరు శ్రీ వర్ధిని.

ఈమె ఓ ప్లే బ్యాక్ సింగర్. అసలు చూడటానికి చాలా చిన్న పిల్లాడిలా కనిపించే తమన్ కు పెళ్ళయ్యిందా అంటే చాలా మంది ఆశ్చర్యపోతారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. థమన్ కు 14 ఏళ్ళ కొడుకున్నాడట. ఈ విషయంను ఓ సందర్భంలో అఖిల్, నాగార్జున చెప్పుకొచ్చారు. ఇక థమన్ కు పెళ్ళయ్యింది అనే విషయాన్ని ఇటీవల మేగా మేనల్లుడు సాయి తేజ్ కూడా చెప్పుకొచ్చాడు. అసలు థమన్ పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలు బయటకి రాలేదు అంటే.. ఆయన ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాడో అర్దం చేసుకోవచ్చు.

Loading...