హింసాత్మకంగా మారిన రాహుల్ వరుణ్ పోటీ..!

637
ticket to finale make more violent among contestants
ticket to finale make more violent among contestants

బిగ్ బాస్ ముగింపు దశకు చేరుకోవడంతో ఇంటి సభ్యుల మధ్య పోటీ పెరిగింది. నువ్వా నేనా అనే స్థాయిలో వీరు కొట్టుకుంటున్నారు. తాజాగా నానిమేషన్ ప్రక్రియలో నేరుగా ఫైనల్ కు వెళ్లే అవకాశాన్ని బిగ్ బాస్ ఇవ్వడంతో కంటెస్టెంట్లు రెచ్చిపోయారు. దాంతో ఒకరిపై ఒకరు పడి కొట్టుకున్నారు. అయితే బ్యాటరీ ఉంటే నిండుగా జరుపుకోండి పండుగ అనే నామినేషన్ టాస్క్ ఇచ్చారు. ఒక బోర్డుపై రంగుల ప్లేట్స్ పెట్టి వాటిని ఇంటి సభ్యులు తీసుకోవాలని సూచించాడు.

అలా ప్లేట్ తీసుకోగా 70 శాతం బ్యాటరీ పాయింట్స్ అలీకి వచ్చాయి. కలర్ బ్లాక్ లో శ్రీముఖి 50 శాతం వచ్చింది. వరణ్ కు 40 శాతం చొప్పున వచ్చాయి. టాస్క్ లో భాగంగా ఇద్దరి చొప్పున పోటీ పెట్టారు. వరుణ్- రాహుల్, బాబా భాస్కర్-శ్రీముఖి, శివజ్యోతి-అలీ జట్లుగా టాస్క్ ఇచ్చారు. శివజ్యోతి, అలీకి అరటి పళ్లు తినే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో అలీ ఎక్కువ పాయింట్స్ తెచ్చుకున్నాడు. దాంతో అలీ విజేతగా నిలిచాడు. ఇక రాహుల్, వరుణ్ కు మధ్య జరిగిన టాస్క్ హింసాత్మకంగా మారింది.

ఒక్కొక్కరికి ఓ బస్తా భుజాన వేసి వాటిలోని సరుకును ఖాళీ చేయాలి. ఎవరైతే బస్తాను ఖాళీ చేస్తారు వారే విజేతగా నిలుస్తారు. ఈ పోటీలో రాహుల్, వరుణ్ రెచ్చిపోవడంతో కాస్త హింసాత్మకంగా మారింది. ఇక బాబా భాస్కర్, శ్రీముఖి మధ్య జరిగిన పోటీ సరదాగా సాగింది. ఓ బాక్సులో ఇంగ్లీష్ అక్షరాలను నోటితో తీసే కార్యక్రమాన్ని ఇచ్చారు.

పిండిలో ఉన్న ఆల్ఫాబెట్స్‌ను తీయడంలో బాబా భాస్కర్‌ సక్సెస్ కావడంతో ఈ పోటీలో ఆయన గెలుపొందారు. టికెట్ ఫినాలే టాస్క్‌లో సుమారు 70 శాతం పాయింట్లతో అలీ రెజా ముందుంటే.. ఆ తర్వాత 50 శాతం పాయింట్లతో రాహుల్ రెండోస్థానంలో ఉన్నారు. ఆ తర్వాత స్థానంలో బాబా భాస్కర్, శ్రీముఖి తదితరులు నిలిచారు.

Loading...