Friday, April 19, 2024
- Advertisement -

బిగ్ బాస్ 4లో యాంకర్ అనసూయ… రోజుకి ఎంతంటే ?

- Advertisement -

తెలుగులోను ‘బిగ్ బాస్’ షో ఎంత పాప్యులర్ అయిందో అందరికి తెలిసిందే. ఇతర భాషల్లో కూడా ఈ షోకి విపరితమైన క్రేజ్ ఉంది. ఇక తెలుగులో ఇంతవరకూ 3 సీజన్లు వచ్చాయి. మొదటి సీజన్ కు ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించగా.. రెండో సీజన్ కు నాని.. మూడో సీజన్ కు నాగార్జున హోస్ట్ గా వ్యవహరించారు. కొంతకాలంగా సీజన్ 4 కోసం బిగ్ బాస్ యాజమాన్యం సన్నాహాలు జరుపుతుంది.

ఈ సీజన్ కోసం ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలను సంప్రదించినట్లుగా వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా అనసూయను కూడా ఈ షో నిర్వాహకులు సంప్రదించినట్టుగా వార్తలు వస్తున్నాయి. గత సీజన్లో యాంకర్ శ్రీముఖిని ఎంపిక చేసుకున్న నిర్వాహకులు ఆమెకి ఎపిసోడ్ కి లక్ష రూపాయలను చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే అనసూయకు అంతకంటే ఎక్కువే ఇచ్చేందుకు బిగ్ బాస్ నిర్వాహాకులు భారీ మొత్తమే ఆఫర్ చేశారట. ఈ విషయంపై అనసూయ ఆలోచిస్తుందట. ఎందుకంటే బిగ్ బాస్ లోకి అనసూయ వెళ్తే కచ్చితంగా మూడు నెలలు ఉండాల్సిందే.

అందుకే అన్ని రోజులు ఫ్యామిలీకి దూరంగా ఉండలేమో అనే అలోచన వల్ల అనసూయ బిగ్ బాస్ ఆఫర్ ను హోల్డ్ లో పెట్టినట్లు తెలుస్తోంది. అలానే బిగ్ బాస్ లోకి వెళ్తే.. జబర్దస్త్.. అలానే సినిమాలు కూడా వదులుకోవాల్సి వస్తుందేమో అని అనసూయ ఆలోచనలో ఉన్నారట అనసూయ. మరి అనసూయ బిగ్ బాస్ లోకి వెళ్లాలని కొంతమంది ఆమె ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ఆమె వెళ్లాలే కానీ మా ఓట్లు ఆమెకే వేసి విన్నర్ ని చేస్తామని సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -