Thursday, April 18, 2024
- Advertisement -

ఇంతకుముందే రష్మీకి పెళ్లి అయిపోయిందా ?

- Advertisement -

తెలుగు బుల్లితెరపై సుడిగాలి సుధీర్, యాంకర్ రష్మి గౌతమ్ ల జోడీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వీరిద్దరు కలిసి ఏ షో చేసిన అది సూపర్ హిట్. అందుకే ఢీ షోకి ఆ రెంజ్ క్రేజ్ వచ్చింది. అయితే రష్మీ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇండియన్ నెవీలో పని చేస్తున్న ఓ వ్యక్తిని రష్మీ పెళ్లి చేసుకుందని.. అతడిని తరుచుగా కలుసేందుకు వైజాగ్ వెళ్లొస్తుందని వార్తలు వస్తున్నాయి. రష్మి పలు ఈవెంట్లు, సినిమాలతో బిజీగా ఉండడంతో హైదరాబాద్లో ఉంటుందని.. భర్త మాత్రం ఉద్యోగ రీత్యా విశాఖపట్టణంలో ఉన్నాడని చర్చించుకుంటున్నారు. ఇందుకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. తనకు సంబంధించినటువంటి ప్రతి విషయం పై స్పందించేటువంటి రష్మి గౌతమ్ తన పెళ్లి విషయంలో మాత్రం ఇప్పటివరకు స్పందించలేదు.

గతంలో సుధీర్ తో పెళ్లి అంటూ రష్మీపై వార్తలు వస్తే.. సుధీర్ జస్ట్ ఫ్రెండ్ అని ఆ వార్తలను కొట్టిపారేసింది. మరి ఈసారి ఈ కొత్త పుకార్లపై రష్మి గౌతమ్ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం రష్మీ షోస్ చేస్తూ.. సినిమాల్లో నటిస్తోంది. బుల్లితెరపై సక్సెస్ అయిన ఈ భామ వెండితెరపై మాత్రం సక్సెస్ కాలేకపోతుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -