2020 లో పెళ్లి చేసుకోబోతున్న హీరోలు వీళ్లే..!

1829
tollywood heroes marrage in 2020
tollywood heroes marrage in 2020

టాలీవుడ్ లో కొంతమంది బ్యాచిలర్స్ ఉన్నారు. ఇంట్లో వాళ్లు వయస్సు వచ్చింది పెళ్లి చేసుకోమని సతాయిస్తున్నా సరే.. జస్ట్ ఆగండి అని పెళ్లిని వాయిదా వేస్తున్నారు. 2020లో నైనా పెళ్లి చేసుకుంటే బావుణ్ణు అని ఎదురుచూస్తారు. ప్రభాస్, రానా,నితిన్ ,నిఖిల్,విజయ్ దేవరకొండ,తనీష్,నవదీప్,ఆర్ ఎక్స్ కార్తికేయ వంటి బ్యాచిలర్స్ ని పరిశీలిస్తే, కొత్త ఏడాదిలో పెళ్ళికి సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది.

ప్రభాస్ విషయంకు వస్తే.. బాహుబలి తర్వాత పెళ్ళి ఉంటుందని చెప్పాడు. కానీ కుదరలేదు. ఇప్పుడు 2020లో ప్రభాస్ పెళ్లి కచ్చితంగా ఉంటుందని తెలుస్తోంది. అమ్మాయిని వెతికే పనిలో కృష్ణంరాజు ఉన్నారట. రాజకీయవేత్త కుమార్తె అని,ఇండస్ట్రియలిస్ట్ కూతురని, బిజినెస్ మ్యాన్ కూతురని రకరకాల కధనాలు వస్తున్నాయి. నితిన్ పెళ్లి ఫిక్స్ అయింది 2020 లో చేసుకుంటున్నాడు. రానా కూడా వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది. విజయ్ దేవరకొండ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు.

ఇప్పటికే అతని పేరెంట్స్ సంబంధాలు చూస్తున్నారట. తనీష్ కి కూడా సంబంధాలు చూస్తున్నా,ఇంకా క్లారిటీ రాలేదు. నవదీప్ సంబంధాలు చూస్తున్నారు. తరుణ్ ఏమీ మాట్లాడ్డం లేదు. ఇక రాజ్ తరుణ్ కెరీర్ మీదే దృష్టి పెడుతూ పెళ్లి ప్రస్తావనలేదు. ప్రిన్స్ ఇంకా కెరీర్ స్టార్ట్ అవ్వలేదు. ఆర్ ఎక్స్ 100కార్తికేయ స్థిరత్వం తెచ్చుకుంటే పెళ్లి ఆటోమేటిక్ గా అవుతుందని ఫాన్స్ అంటున్నారు. కాగా నిఖిల్ కి డాక్టర్ తేజస్వీతో నిశ్చితార్ధం అయింది. త్వరలోనే పెళ్లి అంటూ నిఖిల్ స్వయంగా చెప్పేసాడు.

Loading...