Friday, April 19, 2024
- Advertisement -

అలీకి నిజం తెలిసింది… కోపంలో అలీ భార్య

- Advertisement -

బిగ్ బాస్ లో శ్రీముఖిని చూసి ఫ్యాన్ అయిపోయినవాళ్ళు ఎంతమందో కానీ చిరాకు పడుతున్నవాళ్ళే ఎక్కువ. మొదటివారం చాలా బాగా ఆడుతుంది అనుకున్నారు, రెండోవారం గేమ్ లో మంచి కమాండ్ ఉంది అనుకున్నారు, రాహుల్ ని వరుసగా నామినేట్ చేస్తా అన్నప్పుడు చాలా డేరింగ్ అనుకున్నారు కానీ అలీ విషయంలో శ్రీముఖి ప్రవర్తన చూసి ఏంటి ఈ పిల్ల అనుకున్నవారే ఎక్కువ.

మనం మన ఇంటికి దూరంగా ఒకచోట ఉన్నాం అంటేనే చాలా జాగ్రత్తగా ఉండాలి, అదీ మన చుట్టూ కామెరాలు ఉన్నాయి అంటే ఇంకా జాగ్రత్తగా ఉండాలి. అడ్డుఅదుపు లేకుండా గట్టిగట్టిగా అరుచుకుంటూ, అబ్బాయిల మీద ఎక్కేస్తూ ఆ అమ్మాయి అంటేనే చిరాకు పడే విధంగా చేసుకుంది శ్రీముఖి. ఇలాంటి ప్రవర్తన వల్లనే అలీ భార్య అలాంటి లెటర్ రాసింది అని అందరికీ అర్థం అయ్యింది.

అలీ చాలా టాలెంటెడ్, తెలివైనవాడు, కష్టపడి పైకి వచ్చాడు. మొదట్లో చాలా బాలెన్స్ తో ఆడి అందరి మన్ననలు పొందాడు. ఎప్పుడైతే శ్రీముఖి స్నేహం పట్టాడో అప్పటి నుండే తనలో ముందున్న కంట్రోల్ పొయ్యింది. టాస్క్ లో చాలా బాగా పార్టిసిపెట్ చేసే అలీ మాటిమాటికీ చెల్ అని వెళ్లిపోవడం నేర్చాడు. అదే అతని పతనానికి నాంది. 5 వారాలపాటు టాస్క్ ల్లో డౌట్స్ లేకుండా ఆడిన అలీకి మొన్న జరిగిన కెప్టెన్సీ టాస్క్ ఎందుకు అర్థం కాలేదో, వరుణ్ అర్థం అయ్యేలా చెప్పడానికి ట్రై చేస్తుంటే అది తప్పులాగా ఎందుకు కనబడిందో అలీకే క్లారిటీ ఉండాలి. ఇంకోవారం అలీ ఉండి ఉంటే మారేవాడేమో, కానీ బిగ్ బాస్ హౌస్ అలాంటి ప్లేస్ కాదు ఎప్పటి తప్పుకి అప్పుడే శిక్ష.

బిగ్ బాస్ లో శ్రీముఖి పాత్ర కేవలం కంటెస్టెంట్ మాత్రమే. కానీ శ్రీముఖి అలా ప్రవర్తించడంలేదు. బిగ్ బాస్ ఏధైనా చెప్పడం ఆలస్యం గట్టిగా అరవడం, కేకలు పెట్టడంతో ఎవరికీ బిగ్ బాస్ మీద ఇంట్రస్ట్ లేకుండా చేస్తుంది. ఈవిడ గోల పటాస్ లోనే చూడలేకపోయాం అనుకుంటే మళ్ళీ ఇక్కడ కూడా అవే అరుపులు. బిగ్ బాస్ లేఖ పంపగానే ఎవరికీ తెలుగు రాదు అన్నట్టు శ్రీముఖి లాక్కుని చదవడం, ఎవరన్నా మధ్యలో మాట్లాడబోతే ఆమె మాట్లాడిందే కరెక్ట్ అన్నట్టు మాట్లాడడం చేస్తుంది. శ్రీముఖికి బయట చాలామంది ఫ్యాన్సే ఉన్నారు లేకపోతే ఇన్ని రోజులు శ్రీముఖి లోపల ఉండటం కష్టం. కానీ ఆ అభిమానుల కోసం అయినా శ్రీముఖి కొంచెం మంచిగా ప్రవర్తిస్తే బాగుంటుంది.
ఏదిఏమైనప్పటికీ అలీ ఎలిమినేట్ అవ్వడానికి శ్రీముఖి బిహెవియర్ కారణం అనడంలో అతిశయోక్తిలేదు. అలీ ఆ విషయం బయటకు అనకపోయినా లోలోపల ఆ విషయం పై బాధ పడుతున్నట్టు సమాచారం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -