Thursday, March 28, 2024
- Advertisement -

ఉప్పెన మూవీలో వచ్చే అసలైన ట్విస్ట్ ఇదేనట..?

- Advertisement -

ఉప్పెన మూవీతో వెండితెరకు పరిచయం అవుతున్నాడు మరో మెగా వారసుడు. ఇప్పటికే హీరోగా రాణిస్తున్న చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ ఈ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు సానా ఈ మూవీతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి.

ఇక ఈ మూవీలో విలన్ గా తమిళ్ హీరో విజయ్ సేతుపతి నటించడం విశేషం. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఆయన లుక్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. పేద ధనిక వర్గానికి చెందిన ఓ జంట మధ్య నడిచే సున్నితమైన ప్రేమ కథగా ఈ ఉప్పెన మూవీ తెరకెక్కుతోంది. సినిమాలో ఎమోషన్స్ హైలైట్ గా నిలుస్తాయట. ప్రధానంగా పతాక సన్నివేశాలలో హీరో మరియు హీరోయిన్ మధ్య నడిచే ఎమోషనల్ సన్నివేశాలు సినిమాకు ప్రధాన ఆకర్షణ అని తెలుస్తుంది.

విజయ్ సేతుపతి ఇచ్చే ట్విస్ట్ హైలైట్ గా ఉంటుందని సమాచారం. ఉప్పెన సినిమాలో హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తుంది. విడుదలైన సాంగ్స్ మరియు ప్రోమోలలో ఆమె లుక్స్ చాల క్యూట్ అండ్ మెస్మెరైజింగ్ గా ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం దేవిశ్రీ అందిస్తున్నారు. ఉప్పెన ఏప్రిల్ 2న విడుదల కానుంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -