Thursday, April 25, 2024
- Advertisement -

మెగా హీరో సినిమాలో ఈ హీట్ హీరోయిన్ ఉందా

- Advertisement -

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సినిమా ‘వాల్మీకి’. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’ సినిమాకి రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్ర టీజర్ ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమాలో వరుణ్ తేజ్ గ్యాంగ్స్టర్ అవతారంలో కనిపించబోతున్నాడని తన నెగిటివ్ పాత్ర మరియు ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ ఈ సినిమాకి హైలైట్ కాబోతున్నాయి అని టీజర్ చూస్తేనే అర్థమవుతుంది.

అయితే ఈ సినిమాలో పూజ పూజా హెగ్డే కీలక పాత్ర పోషిస్తోంది. నిజానికి ఈ సినిమాపై అంచనాలు పెరగడానికి గల కారణాలలో పూజ హెగ్డే పేరు కూడా ఒకటి. కానీ ఈ మధ్యనే విడుదలైన టీజర్ లో మాత్రం ఆమె ఎక్కడా కనిపించలేదు. ఎప్పటి నుంచో పూజ హెగ్డే ఈ సినిమాలో ఉన్నట్టు దర్శకుడు హరీష్ శంకర్ హింట్స్ ఇచ్చారు కానీ అధికారిక ప్రకటన మాత్రం విడుదల చేయలేదు. ఈ నేపథ్యంలో అసలు పూజ హెగ్డే ఈ సినిమాలో నటిస్తుందా లేదా అని అనుమానాలు కూడా రేకెత్తుతున్నాయి. పైగా ప్రస్తుతం స్టార్ హీరోయిన్ లలో ఒకరిగా ఎదిగిన పూజ హెగ్డే పేరు ఈ సినిమాకి మరింత హైప్ క్రియేట్ చేస్తుంది అన్న విషయం తెలిసిందే

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -