Friday, April 26, 2024
- Advertisement -

బిగ్ బాస్ 3 విన్నర్ వరుణ్.. ఎందుకంటే ?

- Advertisement -

బిగ్ బాస్ లో ఉండే కంటెస్టెంట్ నచ్చితే వారి కోసం ప్రేక్షకులు ఏం చేయడానికైన రెడీగా ఉంటారు. ప్రస్తుతం తెలుగు బిగ్ బాస్ 3లో రాహుల్, శ్రీముఖి, వరుణ్, అలీ, బాబా మాస్టర్ లు ఉన్నారు. వీరిలో ఎవరు గెలుస్తారో అని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇప్పుడు వరుణ్ సందేశ్ ఫ్యాన్స్ అతని కోసం బాగా కష్టపడుతున్నారు.

అతని ఎలాగైన గెలిపించాలని సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు. ఇది ఇలా ఉంటే వరుణ్ గెలిపించడం కోసం ఒక అడుగు ముందుకేసి ప్రమోషనల్ సాంగ్స్ చేసి యూట్యూబ్ లో కూడా పెట్టేందుకు రంగం సిద్దం చేశారు. అలాంటిదే ఒక వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో వరుణ్ ఫోటోలు ఉన్న టీషర్ట్స్ వేసుకుని యువత డాన్సులు వేస్తూ వరుణ్ పై ఉన్న ప్రేమను తెలియజేస్తున్నారు.

కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఇలాంటి విజువల్సే ఎక్కడో చూసినట్లు కొడుతుందే అని అనిపించక మానదు. ఎందుకంటే గత బిగ్ బాస్ రెండో సీజన్ విన్నర్ కౌశల్ కోసం అతని ఆర్మీ కూడా ఇలానే ఎన్నో చేసింది. ఇప్పుడు అదే స్థాయిలో వరుణ్ కోసం చేస్తున్నారు. ఈ రెండు కలవడం ఎక్కడో తేడా కొడుతుంది. అప్పుడు కౌశల్ టైటిల్ విన్నర్ గా నిలిచాడు.

ఇప్పుడు వరుణ్ టైటిల్ విన్నర్ గా నిలుస్తాడని అందరు అంటున్నారు. ఇక ఇప్పటికే వరుణ్ కు హౌస్ లో మంచి పేరు ఉంది. గేమ్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు. వరుణ్, రాహుల్, శ్రీముఖి వీరిలో ఎవరికైన టైటిల్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎవరు గెలిచిన మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదగా టైటిల్ ను అందుకోనున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -