Saturday, April 20, 2024
- Advertisement -

కొత్త దర్శకుడికి నో చెప్పిన మెగా హీరో

- Advertisement -

ఈ మధ్యనే టు’ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రేస్ట్రేషన్’ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న మెగా హీరో వరుణ్ తేజ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ‘వాల్మీకి’ అనే సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న సంగతి తెలిసిందే. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘జిగర్తాండ’ సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది ఈ సినిమా షూటింగ్ కోసం ఇప్పటికే అమెరికా వెళ్లి బాడీ పెంచటమే కాక బాక్సింగ్ కూడా నేర్చుకుని వచ్చాడు. ఈ సినిమా తర్వాత వరుణ్ తేజ్ యువ దర్శకుడు కిరణ్ తో ఒక సినిమా చేయాల్సి ఉంది. ఆ సినిమాలో కూడా మెగా హీరో బాక్సర్ గానే కనిపిస్తాడట.

అయితే తాజాగా వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ లో తన పాత్రలో బాగా నెగటివ్ షేడ్స్ ఉన్నాయని, ఆఖరికి బాక్సింగ్ ప్రాజెక్టులో కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్నాయని, రెండూ వరుసగా ఇలాంటి సినిమాలు చేస్తే దాని ప్రభావం వేరేలా ఉంటుంది అని అనుకున్న వరున్ తేజ్ యువ దర్శకుడితో చేయాల్సిన ప్రాజెక్ట్ క్యాన్సల్ చేసాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటిదాకా హీరోగా నటించి మంచి హిట్ ను అందుకున్నాడు వరుణ్ తేజ్. పైగా ఇలాంటి సమయంలో తాను రెండు నెగటివ్ పాత్రలలో నటించటం అంటే అది తన ఇమేజ్ ని తానే దెబ్బ తీసుకున్నట్టు అవుతుంది అని వరుణ్ తేజ్ ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మరి పాపం యువ దర్శకుడు ఇప్పుడు ఏం చేస్తాడో ఇంకా తెలియాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -