Saturday, April 20, 2024
- Advertisement -

వెంకీ మామ కథ ఇదేనా?

- Advertisement -

ఈ మధ్యకాలంలో దాదాపు అన్ని సినిమాల పై ఇది కాపీ కథ అంటూ పుకార్లు వినిపిస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. కొంతమంది అఫీషియల్ గా రీమేక్ చేస్తుండగా మరికొందరు కథలు వేరే భాషల నుంచి కాపీ కొడుతున్నారు. తాజాగా నాగచైతన్య వెంకటేష్ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ సినిమా ‘వెంకీ మామ’ పైన కూడా ఇలాంటి ఒక పుకారు ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ‘వెంకీ మామ’ సినిమా కథ భాగవతం పురాణం లోని ఒక పాయింట్ ఆధారంగా రూపుదిద్దుకున్నది అని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

కోన వెంకట్, జనార్దన మహర్షి మరియు డైరెక్టర్ రవీంద్ర ఈ సినిమా కోసం కలిసి పనిచేశారు. కథ గురించి పక్కన పెడితే పురాణాల ప్రకారంగా తన మేనల్లుడు కృష్ణుడు పాలిట కంసుడు విలన్ అయ్యాడు. కానీ ఈ సినిమాలో మాత్రం వెంకీ మామ వల్ల నాగ చైతన్య కి గండం ఉంటుందని ఒక జ్యోతిష్య పాయింట్ ని కూడా వాడ బోతున్నారని సమాచారం. ఈ కథను ఫుల్ లెంత్ ఎంటర్టైనింగ్ గా తెరకెక్కించనున్నారట. ఏదేమైనా వెంకటేష్ నాగచైతన్య కలిసి నటిస్తున్నారు కాబట్టి ఈ సినిమా పైన భారీ అంచనాలే ఉన్నాయి మరి ఈ సినిమా ఎలా ఉండబోతుందో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -