Thursday, March 28, 2024
- Advertisement -

ఆర్ఆర్ఆర్ లో విజయశాంతి ?

- Advertisement -

ప్రస్తుతం దర్శక దిగ్గజం రాజమౌళి రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల తో ఆర్ఆర్ఆర్ అనే సినిమా తో బిజీ గా ఉన్నాడు. అయితే ఈ సినిమా కాస్టింగ్ ఇంకా పూర్తి కాలేదు. అలియా భట్ రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా చేస్తుంది కానీ ఎన్టీఆర్ పక్కన హీరోయిన్ గా ఎవరు ఉండాలి అనే విషయం పై మేకర్స్ ఇంకా ఒక క్లారిటీ కి రాలేదు. చాలా మంది విదేశీ భామలని ఈ సినిమా కోసం చూస్తున్నారు. అలాగే ఈ సినిమా లో కారెక్టర్ ఆర్టిస్ట్స్ కోసం చాలా మందిని అనుకుంటున్నారు. తాజా ఫిలిం నగర్ సమాచారం ప్రకారం ఈ సినిమా లో విజయశాంతి కి ఒక చిన్న పాత్ర ఆఫర్ చేశారట,

ఈ సినిమా లో సెకండ్ హాఫ్ లో ఒక కీలక పాత్ర సినిమా లో కనిపిస్తుంది అంట. ఆ పాత్ర నిడివి తక్కువ అయినా, ఆ పాత్ర వలన కథ మలుపు తిరుగుతుంది అని తెలుస్తుంది. ఈ పాత్ర కి విజయశాంతి అయితే బాగుంటుంది అని మేకర్స్ అనుకుంటున్నారట. ఇదే విషయం ఆమెకు కూడా చెప్పి ఎలాగైనా ఒప్పించాలి అనే ప్రయత్నం లో సినిమా యూనిట్ ఉంది అని తెలుస్తుంది. అయితే దీనిపై ఇంకా ఒక క్లారిటీ రాలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -