Thursday, April 25, 2024
- Advertisement -

పందెం కోడి 2 కి సర్వం సిద్దం

- Advertisement -

తమిళ హీరో విశాల్ కెరీర్ లో బెస్ట్ సినిమా అంటే ‘పందెం కోడి’ అనే అంటారు అందరూ . ఇప్పటికీ ఈ సినిమా వలనే విశాల్ ని గుర్తుపడతారు ఫామిలీ జనాలు. అంతగా ఫామిలీ , యూత్ ని ఆకట్టుకున్న సినిమా ఇది. ఈ సినిమా తెలుగు, తమిళ బాషలలో విడుదల అయ్యి అప్పట్లో చాలా పెద్ద హిట్ అయ్యింది.

సో ఈ సినిమా ని క్యాష్ చేసుకోవడం కోసం దీని సీక్వెల్ కి సిద్దం అవుతున్నాడు హీరో విశాల్. డైరెక్టర్ లింగు స్వామి ఈ సినిమా కోసం ఒక అదిరిపోయే స్క్రిప్ట్ ని సిద్దం చేసారు అని తెలుస్తోంది. పందెం కోడి సినిమా ఏక్కడ అయితే ఆగిపోయిందో అక్కడ నుంచీ ఈ సెకండ్ పార్ట్ షురూ అవుతుంది అంటున్నారు.

తెలుగు తమిళ భాషల్లో విశాల్ తో పాటు విలన్ పాత్రలో సత్యరాజ్ ఉంటారు. పాత సినిమా లో  హీరోయిన్ గా చేసిన మీరా జాస్మిన్ నే ఇందులో కూడా అనుకున్నారు ఆమె ఫేడ్ అవుట్ పోవడంతో తమన్నా ని హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారు. ఫిబ్రవరి నుంచీ షూటింగ్ మొదలు అవుతుంది అంటున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -