ఎఫ్2 కూడా సినిమానేనా : విశ్వక్ సేన్ షాకింగ్ కామెంట్స్

2903
Vishwak Sen comments on Anil Ravipudi F2
Vishwak Sen comments on Anil Ravipudi F2

హీరో విశ్వక్ సేన్ టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న హీరో. చేసినవి తక్కువ సినిమాలే అయినప్పటికి ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ నగరానికి ఏమైంది ఫలక్ నుమా దాస్ హిట్.. సినిమాలు చేశాడు. ఈ హీరో తన అభిప్రాయాలను నిర్మొహమాటంగా చెప్తూ తంటాలను కొని తెచ్చుకుంటాడు.

ఈ మధ్య ఒక టీవీ షోలో నీకు నచ్చని మూవీ గురించి చెప్పమంటే టక్కున ‘ఎఫ్2’ అనేశాడు. ఆ సినిమా పెద్ద హిట్టయింది కానీ తానూ ఆ కామెడీని పావుగంటకి మించి చూడలేక వాకౌట్ చేసానని విశ్వక్ చెప్పాడు. ఇంకా మాట్లాడుతూ.. ‘కొన్ని రకాల సినిమాల జోనర్ కే నేను వ్యతిరేకం. కమర్షియల్ అని పేరు పెట్టుకుని చేసే కొన్ని సినిమాల్లో ఏముంటుందో అర్ధం కాదు. ఎఫ్2 సినిమానే తీసుకుంటే ఆ సినిమాలో కథ ఏమీ లేదు. కమర్షియల్ సినిమా అర్ధం మార్చేస్తున్నారు తప్ప మరింకేమీ లేదు. కుళ్లు జోకులు ఉండే ఆ రకమైన సినిమాలకు నేను వ్యతిరేకం. అలాంటి సినిమాలు నేను చేయలేను.

ఇది నా అభిప్రాయం మాత్రమే. కానీ అలాంటి సినిమాలతో ప్రేక్షకులను మెప్పించడం కూడా ఓ కళే. 100కోట్లకు పైగా వసూలు చేసిన సినిమా అది. నా దృష్టిలో కేరాఫ్ కంచరపాలెం కమర్షియల్ సినిమా’ అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. దీనిపై నెటిజన్లు విశ్వక్ సేన్ పై విమర్శలు చేస్తున్నారు. వెంకటేశ్ సినిమాను విమర్శించే స్థాయి నీకు లేదు సీనియర్ హీరో అనే రెస్పెక్ట్ కూడా నీకు లేదు నీకు ప్రమోషన్ చేసిన వెంకటేశ్ నే విమర్శిస్తావా.. అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.

Loading...