Friday, March 29, 2024
- Advertisement -

ఈ వారం బిగ్ బాస్ నుంచి అవుట్ అయ్యేది ఎవరంటే ?

- Advertisement -

తెలుగు బిగ్ బాస్ షో 12వ వారంలోకి ఎంట్రీ ఇచ్చింది. మొత్తానికి క్లైమాక్స్ దశకు చేరుకుంటుంది. ప్రస్తుతం హౌస్ లో ఏడుగురు సభ్యులు ఉన్నారు. వీరిలో ఎవరు గెలుస్తారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఏడుగురు నామినేషన్ లో ఉన్నారు. ఇచ్చిన నెంబర్లను సెలెక్ట్ చేసుకోవడంలో ఇంటి సభ్యులు విఫలం కావడంతో అందరు నామినేట్ అయ్యారు. ఇక ఈ వారం వరుణ్ సందేశ్ భార్య వితిక ఎలిమినేట్ అవుతుందని అందరు అనుకుంటున్నారు.

బిగ్ బాస్ హౌస్ లో వచ్చినప్పటి నుంచి వీక్ కంటెస్టెంట్ గా వితిక ఉంది. రెండు సార్లు నామినేషన్ నుంచి తప్పించుకోవడం.. ఒకసారి బ్యాటిల్ ఆఫ్ మెడాలియన్ త్యాగం చేయడం.. మరోసారి కెఫ్టెన్ గా ఉండటంతో వితిక ఎలిమినేషన్ నుంచి బయటపడింది. ఇక తాజాగా చివరి దశలో బిగ్ బాస్ ఉండటంతో ఎలిమినేషన్ లో ఉన్న ఆమె ఈ వారం ఎలిమినేషన్ లో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నట్లు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.

ప్రైవేటు పోల్స్ లో కూడా వితికకు ఓటింగ్ చాలా తక్కువగా ఉన్నట్లు చూపిస్తున్నాయి. ఇక వరుణ్ సందేశ్ కూడా తన భార్యను నామినేషన్ల నుంచి కాపాడేందుకు ట్రై చేస్తున్నాడు. తాజాగా వితికాను సేవ్ చేయడం కోసం పంతానికి పోయి అందరూ నామినేట్ అయ్యేలా వరుణ్ చేశాడు. వితికాను కాపాడేందుకు వరుణ్ చేసే ప్రయత్నాల్లో అతను గెలిచే ఛాన్స్ లు కూడా పాడు చేసుకున్నట్లు అయింది.

హౌస్ లో ఎంట్రీ ఇచ్చిన మొదటివారంలో వితికను కేవలం కంటెస్టంట్ గా మాత్రమే చూసిన వరుణ్ ఇప్పుడు ఆమపై ప్రేమను చూపిస్తున్నాడు. ఆమెని చివరి వరకు హౌస్ లో ఉంచేందుకు ప్లాన్స్ వేస్తున్నాడు. ఇక తాజాగా శివజ్యోతితో వరుణ్ మాటల యుద్దానికి దిగడం ద్వారా తనకున్న ఓర్పు కూడా కోల్పోయాడు. ఏది ఏమైనా తన భార్యను సేవ్ చేసే ప్రయత్నంలో వరుణ్ టైటిల్ పోరులో వెనకపడ్డాడు అనేది మాత్రం నిజం.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -