Friday, March 29, 2024
- Advertisement -

ఎన్టీఆర్ బ‌యోపిక్‌లో వీవీ వినాయక్ ?

- Advertisement -

నంద‌మూరి తాక‌ర రామారావు జీవిత క‌థ‌ను ఎన్టీఆర్ అనే పేరుతో సినిమాగా తెర‌కెక్కిస్తున్నారు.ఇప్ప‌టికే సినిమా షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది.ఈ సినిమాలో చంద్రబాబునాయుడిగా రానా .. హరికృష్ణగా కల్యాణ్ రామ్ .. ఏఎన్నార్ గా సుమంత్ .. శ్రీదేవిగా రకుల్ .. జయప్రదగా తమన్నా నటించారు. దర్శకుడు కేవీ రెడ్డిగా క్రిష్ .. విఠలాచార్యగా ఎన్.శంకర్ నటిస్తున్నారు. ఇక దాసరి నారాయణరావు పాత్రలో వీవీ వినాయక్ నటించనున్నాడనేది తాజా సమాచారం.

దాసరి నారాయణరావు .. ఎన్టీ రామారావు కాంబినేషన్లో వచ్చిన ‘సర్దార్ పాపారాయుడు’ .. ‘బొబ్బిలి పులి’ .. ‘విశ్వరూపం’ సంచలన విజయాలను సాధించాయి. అందువలన ఎన్టీఆర్ బయోపిక్ లో దాసరి నారాయణరావు పాత్రను చూపించవలసిన అవసరం వుంది. ఈ పాత్రకి గాను వినాయక్ అయితే బాగుంటుందని భావించి, ఆయనను ఒప్పించినట్టు తెలుస్తోంది. త్వరలోనే దాసరి పాత్రకి సంబంధించిన సన్నివేశాలను వినాయక్ పై చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. క్రిష్ ద‌ర‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాను బాల‌య్యే త‌న సొంత నిర్మాణ సంస్థ‌లో నిర్మిస్తున్నారు.

 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -