Wednesday, April 24, 2024
- Advertisement -

వడ్డే నవీన్ ఇప్పుడే ఎక్కడున్నాడు.. ఏం చేస్తున్నాడో తెలుసా ?

- Advertisement -

బొబ్బిలి పులి వంటి సినిమాలను తీసిన వడ్డే రమేశ్ కొడుకే నవీన్. టాలీవుడ్ లోకి వడ్డే నవీన్.. కోరుకున్న ప్రియుడు మూవీతో ఎంట్రీ ఇచ్చాడు. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా మంచి హిట్ అయింది. అ తర్వాత మానసిచ్చి చూడు, బాగున్నారా, మా ఆవిడ మీద ఒట్టు మీ ఆవిడ చాలా మంచిది ఇలా దాదాపుగా 30సినిమాల వరకూ చేశాడు.

అయితే ఎటాక్ సినిమా తర్వాత సడన్ గా నవీన్ టాలీవుడ్ నుంచి మాయమయ్యాడు. రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ఎటాక్ 2014లో వచ్చింది. అయితే నవీన్ మంచి నటుడు. కానీ అతని కెరీర్ సరిగ్గా లేకపోవడానికి కారణం అతను సరైన కథలను ఎంచుకోకపోవడమే అని తెలుస్తోంది. ఎంచుకున్న సినిమాలన్నీ ప్రేమ కథా చిత్రాలే కావడం.. ఒకే మూసలో ఉండడం వలన ఎక్కువ హిట్లు లేక దెబ్బతిన్నాడనని టాక్.

మొదట్లో యూత్.. ఆతర్వాత ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకున్న నవీన్ ఈ మధ్య అతడి కొడుకు ఫంక్షన్ లో కనిపించాడు. లేటెస్ట్ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మళ్ళీ సినిమాల్లో నటిస్తే బావుణ్ణు అంటూ అతని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం వ్యాపార లావాదేవీలు విజయవంతంగా నిర్వహిస్తూ.. ఫ్యామిలీతో ఆనందంగా గడుపుతున్నాడు వడ్డే నవీన్.

నిహారిక ఎంగేజ్మెంట్ లో స్పెషల్ గా ఎట్రాషన్ గా నిలిచిన బన్నీ..!

నిహారిక నిశ్చితార్థానికి బాబాయ్ పవన్ ఎందుకు రాలేదో తెలుసా ?

రాహుల్ తో పునర్నవి పెళ్లి చేసేశారు.. అదిరిందిపో..!

కాస్టింగ్ కౌచ్‌ గురించి అనసూయ షాకింగ్ కామెంట్స్..!

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -