Thursday, April 25, 2024
- Advertisement -

జార్జియా కారు డ్రైవర్ అనుష్క చేసిన సాయం ఏంటంటే ?

- Advertisement -

కొందరు అందంగా కనిపిస్తారు కానీ అందమైన మనసు మాత్రం ఉండదు. నిజానికి అందమైన మనసు ఉన్నవారే అందంగా కనిపిస్తారు. కానీ టలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న అనుష్క.. అందంతో పాటు అందమైన మనసు కలిగి ఉందని ఇప్పటికే చాలా మంది చెప్పారు. అనుష్కను అందరూ ముద్దుగా స్వీటీ అని పిలుస్తారు. ఆమె అందమైన మనసు గురించి తెలిస్తే ఎవరైన ఫిదా కావాల్సిందే.

ఆమె మనసు ఎంత విశాలంగా..దయార్థంగా ఉంటుందో ప్రముఖ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి చెప్పేశారు. తాను ఐదారు నెలల క్రితం జార్జియాకు వెళ్లినట్లు చెప్పిన ఆయన.. అక్కడ కారు డ్రైవర్ కమ్ కేర్ టేకర్ గా వ్యవహరించే గాజా.. మీకు స్వీటీ తెలుసా? అని ప్రశ్నించటం తో తాను షాక్ అయినట్లు చెప్పారు. ఒక పని మీద తానా దేశానికి వెళ్లినప్పుడు తనకు గాజా అనే కారు డ్రైవర్ కలిశాడని.. అతగాడు స్వీటీ గురించి అడిగి.. ఆమె తనకు చేసిన సాయం గురించి చెప్పుకున్నాడని చెప్పారు.

తమిళ మూవీ షూటింగ్ లో పాల్గొనేందుకు జార్జియాకు వెళ్లిన స్వీటీకి.. కారు డ్రైవర్ గా.. కేర్ టేకర్ గా వ్యవహరించిన గాజా కారును ఫైనాన్స్ వారు తీసుకెళ్లిపోతుంటే.. అనుష్క అతడికి కొత్త కారు కొనిచ్చిన వైనాన్ని తనకు చెప్పారంటూ కొత్త విషయం చెప్పారు. ఈ విషయం తెలియడంపై ఆమెపై గౌరవం, మర్యాద మరింత పెరిగిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -