Wednesday, April 24, 2024
- Advertisement -

నాగబాబును కొట్టిన చిరంజీవి.. ఎందుకు ?

- Advertisement -

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి సోదరుడు నాగబాబు పలు సినిమాల్లో నటించి మెప్పించారు. చిరు, నాగబాబు కలిసి కొన్ని సినిమాలో నటించారు. ఆ తర్వాత నాగబాబు నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించారు. ఇక ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. జబర్దస్త్ కామెడీ షో జడ్జిగా ఉన్నారు. అయితే ఏ విషయంలోనైన తనకు అన్నయ్యే స్పూర్తి అని చెబుతుంటారు నాగబాబు.

చిన్నప్పుడు మీరు ఎప్పుడైన నాగబాబును కొట్టారా ? అని చిరంజీవిని ఓ సందర్భంలో ప్రశ్నించగా ఇలా చెప్పుకొచ్చారు. నేను ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లో నాగబాబు ఆరో, ఏడో చదువుతున్నాడు. ఆ టైంలో అమ్మకు అన్ని విషయాల్లో సాయం చేస్తూ ఉండేవాడిని. ఒక రోజు లాండ్రీ నుంచి బట్టలు తీసుకురావడంతో పాటు, మరో చోటుకి కూడా వెళ్లాల్సి వచ్చింది. రెండు ఒకే సమయంలో చేయాల్సి రావడంతో.. నేను బయటకు వెళ్లొచ్చే సరికి లాండ్రీకి వెళ్లి బట్టలు తీసుకురా అని నాగబాబుకు చెప్పాను.

నేను పని చూసుకుని వచ్చి.. బట్టలు తెచ్చావా అని అడిగితే తీసుకురాలేదు అన్నాడు. ఎందుకు తేలేదని అడిగితే నిద్రపోతున్నా అన్నాడు. నాకు కోపం వచ్చి కొట్టేశాను. అది చూసి అమ్మకు నాపై కోపంతో చిన్నోడిని అలా కొడతావా ? అంటూ నన్ను తిట్టింది. సాయంత్రం నాన్న రాగానే ఏడుస్తూ మొత్తం చెప్పేశా. అప్పుడు నాన్న వెళ్లి నాగబాబును మందలించాడు. అప్పుడు నాకు రిలీఫ్ గా అనిపించిందని నవ్వుతూ చిన్నప్పటి సంగతులను గుర్తు చేసుకున్నారు చిరు.

అయితే చిరు, నాగబాబు కలిసి అంజి సినిమాలో నటించగా.. ఈ చిత్రం సంభాషణల్లో చిరుని ఒరేయ్, ఏరా అంటూ పిలవాల్సి ఉండగా.. తాను అన్నయ్యను అలా పిలవలేనని చెప్పారట. అప్పుడు చిరంజీవి పర్వాలేదు మనం చేసేది పాత్రలు మాత్రమే అని చెప్పి నచ్చజెప్పిన తర్వాత నాగబాబు ఒప్పుకున్నారట.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -