Friday, March 29, 2024
- Advertisement -

సూర్య కొంప ముంచింది ఎవరు..?

- Advertisement -
who is discuraging surya

చాలా సార్లు రిలీజ్ వాయిదా పడి ఈ నెల 9న సింగం 3 ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది. భారీ అంచ‌నాల‌తో రిలీజ్ అయిన ఈ సినిమా ఆ అంచనాలను అందుకోలేకపోయింది. మూవీకి కూడా మోస్త‌రు టాక్ వచ్చిన.. క‌లెక్ష‌న్లు మాత్రం చాలా వీక్‌గా ఉన్నాయి. సూర్యకి తెలుగులో కూడా మంచి పేరు ఉంది.

సింగం 3 సినిమాను తెలుగు, త‌మిళ భాషల్లో ఒకేసారి విడుదల చేయాల‌నుకున్న సూర్య ముందుగా ఈ మూవీని డిసెంబ‌ర్ 16న విడుదల చేస్తున్న‌ట్టు చెప్పారు. అయితే అదే సమయంలో తెలుగులో ఓ యంగ్ హీరో సినిమాకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు ఓ అగ్ర నిర్మాత సూర్య‌పై ఒత్తిడి తెచ్చి సింగం-3ను వాయిదా వేయించాడ‌న్న ప్ర‌చారం జ‌రిగింది. సూర్య అతి మంచిత‌నానికి పోయి త‌న సినిమాను డిసెంబ‌ర్ 23కు త‌ర్వాత జ‌న‌వ‌రి 26కు వాయిదా వేసుకున్నాడు.

తిరిగి ఫిబ్ర‌వ‌రి 9కు వాయిదా ప‌డింది. ఇప్పుడు తమిళంలో అక్క‌డ రాజ‌కీయాలు ఇంట్ర‌స్టింగ్‌గా ఉండ‌డంతో జ‌నాలు సింగం 3 గురించి ప‌ట్టించుకోవ‌డం లేదు. ఫ‌స్ట్ వీకెండ్‌లో తెలుగులో రూ.5 కోట్ల షేర్ వ‌స్తే…త‌మిళ్‌లో కేవ‌లం రూ.7 కోట్ల షేర్ మాత్ర‌మే రాబ‌ట్టింది. తమిళనాట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సూర్య ‘సింగం 3’ పరిస్థితి అక్కడ ఘోరంగా ఉందట. అక్క‌డ సింగం 3కు రూ.60 కోట్ల బిజినెస్ అయ్యింది. ఈ లెక్కలు చూస్తే ఈ సినిమా కొన్న బ‌య్య‌ర్లు ఘోరంగా న‌ష్ట‌యినట్టు కనిపిస్తున్నారు. మొత్తానికి సూర్య అతిమంచిత‌నానికి పోయి.. ఈ సమయంలో విడుదల చేసుకుని బాగా నష్టపోయినట్టు ఇండ‌స్ట్రీలో టాక్ వినిపిస్తోంది.

Related

  1. పాపం.. రాజ్ తరుణ్ పరిస్థితి ఇలా అయిందేంటి..?
  2. అనుష్క చేసిన ప్రయోగం తిప్పికొట్టింది.. అందుకే అలా అయ్యింది..!
  3. దేవి కోరిక ను పక్కన పెట్టిన డైరెక్టర్!
  4. స‌న్నీ మొదటి సెక్స్ అనుభ‌వం ఎవరితోనో తెలుసా..?

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -