రాధే శ్యామ్ కి మ్యూజిక్ కొట్టెది ఎవ్వరు..?

- Advertisement -

నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధే శ్యామ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోగా, త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.  ఈ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ పూజ హెగ్డే పాత్ర ప్రేరణ ఫస్ట్ లుక్ ని ఆమె పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేయగా ఆ పోస్టర్ కి మంచి స్పందన లభించింది. అయితే కరోనా కారణంగా ఈ సినిమా రిలీజ్ లేట్ అవుతూ వచ్చింది..కరోనా కారణంగానే ఇప్పటివరకు ఈ సినిమా షూటింగ్ ముందుకు కదల్లేదు.. దాంతో ఆటోమేటిక్ గా సినిమా రిలీజ్ కూడా పోస్ట్ ఫోన్ ఐయ్యింది.

అయితే ప్రభుత్వం సడలింపులు నేపథ్యంలో తిరిగి షూటింగ్ లు ప్రారంభించారు.. అయితే రాధేశ్యామ్ సినిమా షూటింగ్ విదేశాల్లో ఉండడంతో ఇప్పటికే వారు అక్కడికి చేరుకొని క్వారంటైన్ లో ఉండి షూటింగ్ ని మళ్ళీ మొదలుపెట్టనున్నారు.. అలా విదేశాలలో షూటింగ్ ప్లాన్ చేసుకున్న సినిమాలు అన్నిటికీ ప్రభాస్ సినిమా రాధే శ్యామ్ మార్గదర్శిగా మారింది. ఈ చిత్రం బృందం ఇప్పటికే ఇటలీ బయలుదేరి వెళ్లారు. అక్కడ ముందుగా పద్నాలుగు రోజుల క్వారంటైన్ లో వుండి, అనంతరం షూటింగ్ మొదలు పెడతారు. అక్కడ షూటింగ్ చేసుకోవడానికి ఏమైనా ఇబ్బందులుంటాయా, దానికి చేయాల్సిన ప్రాసెస్ ఏమిటి వగైరా అన్నీ రాధే శ్యామ్ బృందం నుంచి తెలుసుకుని వచ్చే నెలలో అక్కడకు వెళ్లాలని చాలా మంది నిర్మాతలు ఎదురు చూస్తున్నారు.

- Advertisement -

ఇక ఈ సినిమా గురించి అన్ని పాజిటివ్ వైబ్స్ ఉన్న ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మాత్రం ఎందుకు జాప్యం చేస్తుందా అని ప్రభాస్ అభిమానులు మండిపడుతున్నారు.. అంతకుముందంటే షూటింగ్‌ బిజీలో ఉండి మ్యూజిక్ డైరెక్టర్ సంగతి తేల్చలేదు అనుకుందాం. కానీ ఆరేడు నెలలుగా షూటింగ్ లేదు. చిత్ర బృందమంతా ఖాళీగానే ఉంది. మరి ఈ సమయంలో ఎవరితోనూ ఎందుకు సంప్రదింపులు జరపలేదు. మ్యూజిక్ విషయంలో ఎందుకు ఏమీ తేల్చలేదు అన్నది అభిమానులకు అర్థం కావడం లేదు. పాన్ ఇండియా సినిమాలు చేస్తూ ఈ మాత్రం ప్లానింగ్ లేకుంటే ఎలా అన్నది ప్రేక్షకుల ప్రశ్న. ‘రాధేశ్యామ్’ ఒక ప్రేమకథ. అందులో సంగీతానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. మనసు పెట్టి, టైం తీసుకుని సంగీతం అందించాల్సిన అవసరం ఉన్న సినిమా ఇది. ఇలాంటి సినిమా విషయంలోనూ సంగీత దర్శకుడిని ఖరారు చేసే విషయంలో ప్రభాస్, యువి క్రియేషన్స్ అధినేతలు, దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ఎందుకు నాన్చుతున్నారన్నది అర్థం కావడం లేదు అంటున్నారు.. 

ప్రభాస్ ఆదిపురుష్ విషయంలో ఇంత ప్లాన్ చేస్తున్నాడా….?

అమితాబ్ ని నమ్ముకునే నాగ్ అశ్విన్ సినిమా చేస్తున్నాడా..?

‘సర్కార్ వారి పాట’ యాక్షన్ ప్లాన్ చేంజ్.. ఎందుకు..?

పూజా హెగ్డే గురించి మనకు తెలియని కొన్ని విషయాలు

Most Popular

‘బిగ్ బాస్’లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా మంగ్లీ..!

తెలుగు రియాల్టీ షో బిగ్ బాస్ మంచి రేటింగ్ తో దూసుకెళ్తోంది. ఇప్పటికే షో మొదలై సంగం రోజులు పూర్తైంది. ఇప్పుడు హౌస్ లోకి మరో కంటెస్ట్ంట్ వైల్ కార్డ్...

అప్పట్లో నన్ను కూడా వేధించారు : హీరోయిన్ ఆమని

ఎస్.వి కృష్ణ రెడ్డి దర్శకత్వం వహించిన “శుభలగ్నం” అనే సినిమాలో హీరోయిన్ గా నటించి ఎంతో మంది ప్రేక్షకుల అభిమానాన్ని అందుకుందు ఆమని. అప్పట్లో ఆమని.. వెంకటేష్, జగపతి బాబు,...

ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుంచి నో ఎలిమినేషన్..?

బిగ్ బాస్ నాలుగో సీజన్ లో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే డేంజర్ జోన్ లో ఇద్దరు సభ్యులు ఉన్నారు. మోనాల్...

Related Articles

ప్రభాస్ కి హీరోయిన్ దొరకడం లేదట..!

రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా పరాజయం తర్వాత తాను చేయబోయే సినిమా లపై ప్రత్యేక దృష్టి పెడుతున్నాడు.. సాహో విషయంలో చేసిన పొరపాట్లను మళ్ళీ పునరావృతం అయ్యేలా చేసుకోకూడదు...

శంకర్ దాదా సక్సెస్.. హీరోలందరు కలిసిన వేళ.. ఫోటో వైరల్..!

టాలీవుడ్ స్టార్ అందరు ఒకే దగ్గర చేరడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైన ఏదైన ఫంక్షన్స్ లో తప్పిస్తే కలవరు. వీరంతా ఒక్కచోట చేరితే ఆ సందడి ఎలా...

ఆదిపురుష్ బడ్జెట్ ఎంతో తెలుసా…?

సాహో ఫ్లాప్ వల్ల ప్రభాస్ రాదే శ్యాం పై ప్రత్యేక ద్రుష్టి పెడుతున్నాడు.. ఇప్పటికే రాధే శ్యామ్ సినిమా కి సంబంధించి స్క్రిప్ట్ ని మార్పించి మరీ సినిమా ని...
- Advertisement -
Loading...

Recent Posts

- Advertisement -
Loading...