దేవిశ్రీప్రసాద్ డైరెక్టర్ లను తమన్ లాగేసుకుంటున్నాడా!!

828
why thaman got devisri directors
why thaman got devisri directors

టాలీవుడ్ లో కొన్ని కాంబినేషన్ లు ఎప్పటికి మారవు.. నిజానికి వారి కాంబో లో సినిమాలు వస్తున్నాయంటే చాలు అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తుంటారు.. ఆ మేజిక్ హీరో డైరెక్టర్ కాంబో ఒక్కటే కాదు అందరి టెక్నీషియన్స్ విషయంలోనూ ఉంటుంది.. ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్ డైరెక్టర్ ల మధ్య బంధం చాల దగ్గరగా ఉండాలి.. లేదంటే సినిమా కి ఆయుపట్టైన సంగీతం దెబ్బతినే అవకాశం ఉంటుంది.. ఇప్పటివరకు టాలీవుడ్ లో డైరెక్టర్ , మ్యూజిక్ డైరెక్టర్ కాంబో లు చూసుకుంటే రాజమౌళి కీరవాణి ల కాంబో ది బెస్ట్ అని చెప్పొచ్చు..

వీరి కలయిక లో వచ్చిన సినిమాలు అన్ని సూపర్ హిట్.. ఆ తర్వాత దేవిశ్రీ త్రివిక్రమ్, దేవిశ్రీ కొరటాల శివ, దేవిశ్రీ సుకుమార్ ఇలా దేవిశ్రీ చాలామంది దర్శకుల వద్ద ఆస్థాన సంగీతం దర్శకులుగా ఉన్నారు.. దేవి ఉంటే చాలు తమ సినిమా సంగీతం అదిరిపోతుందనుకునే స్థాయికి దేవి శ్రీ పాటలు ప్రేక్షకులకు విపరీతంగా ఎక్కేశాయి.. అయితే తమన్ రూపంలో దేవిశ్రీ సినిమాలకు గండిపడుతుంది.. అంతేకాదు దేవి శ్రీ డైరెక్టర్ లను సైతం తమన్ ఎగరేసుకుపోతుండడం ఇప్పుడు దేవిశ్రీ అభిమానులను కలవరపెడుతుంది..

మొదట్లో దేవిశ్రీ తో బోయపాటి శ్రీను ఎక్కువగా సినిమా లు చేసేవాడు కానీ తమన్ ఎప్పుడైతే వచ్చాడో బోయపాటి శ్రీను తమన్ తో నే ఎక్కువ సినిమా లు చేస్తున్నాడు.. ఇక త్రివిక్రమ్ దేవిశ్రీప్రసాద్ ల మైత్రి గురించి అందరికి తెలిసిందే.. త్రివిక్రమ్ ఎక్కువగా దేవిశ్రీ తోనే సినిమాలను చేసేవాడు.. కానీ తమన్ తో అరవింద సమేత నుంచి చేస్తూ దేవి ని పక్కనే పెట్టాడు.. ఇక ఇప్పుడు కొరటాల శివ నే తమన్ టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.. కొరటాల శివ తన మొదటి సినిమా నుంచి దేవిశ్రీ తోనే పనిచేశాడు.. మెగాస్టార్ ఆచార్య కు మాత్రం చిరంజీవి బలవంతాన మణిశర్మ తో పనిచేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత కొరటాల శివ అల్లు అర్జున్ తో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కి మళ్ళీ తన పాత స్నేహితుడైన దేవిశ్రీ తో చేస్తాడనుకున్న.. కానీ సీన్ లోకి తమన్ ఎంటర్ అయి పోయాడట..  అల్లు అర్జున్ అలవైకుంఠపురం ఆల్బం సూపర్ హిట్ కారణంగా బన్నీ తమన్ వైపుకే ఎక్కువ మొగ్గు చూపుతున్నాడట.. దేవి శ్రీ ప్రసాద్ చేతిలో కూడా అల్లు అర్జున్ ‘పుష్ప’ వంటి బడా ప్రాజెక్టు ఉంది.

Loading...