Thursday, April 25, 2024
- Advertisement -

ఆర్ ఆర్ ఆర్‌లో గుండుతో ఎన్టీఆర్ కనిపిస్తాడా ?

- Advertisement -

రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమా ఆర్ ఆర్ ఆర్‌. ఈ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు హీరోలుగా నటిస్తున్న విషయం తెలిసిందే. పిరియాడిక్ యాక్షన్ డ్రామాగా వస్తోన్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తుంటే ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో కనిపించనున్నారు.

ఈ పీరియాడిక్ మల్టీ స్టారర్ పై భారీ అంచనాలున్నాయి. ఇక ఎన్టీఆర్‌కు జోడిగా ఇంగ్లీష్ నటి ఒలివియా మోరిస్ నటిస్తుంటే, చరణ్‌కు జోడిగా హిందీ నటి అలియా భట్ నటిస్తోంది. ఇటీవలే ఎన్టీఆర్ పై విశాఖ ఏజెన్సీ ప్రాంతంలో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించాడు దర్శకుడు రాజమౌళి. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్ర, ఆయన లుక్ గురించి ఓ ఆ సక్తికర రూమర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ ఉద్యమకారుడు కొమరం భీమ్ పాత్ర చేస్తున్నాడు. అయితే విషయం ఏమంటే చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్‌లో ఎన్టీఆర్ గుండుతో కనిపిస్తారని టాక్.

ఇది వినడానికి క్రేజీగా ఉన్నప్పటికీ చరిత్ర రీత్యా కొమరం భీమ్ తలపాగా ధరించి ఉన్నారు. ఇటీవల లీకైన లుక్ లో కూడా ఎన్టీఆర్ తలపాగాతో కనిపించారు. దీనికితోడు రాజమౌళి చారిత్రక పాత్రలను కొంత కల్పితం జోడించి ఈ మూవీ చేస్తున్నానని చెప్పిన తరుణంలో ఈ వాదనలను కొట్టిపారేయలేం. అయితే ఈ సినిమాపై క్లారిటీ రావలంటే చిత్ర యూనిట్ స్పందించాల్సి ఉంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -