Wednesday, April 24, 2024
- Advertisement -

అమెజాన్‌కు రూ.30ల‌క్ష‌ల టోక‌రా

- Advertisement -

ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేస్తే… స‌బ్బుబిళ్ల‌లు, రాళ్లు వ‌స్తున్నాయ‌న్న వార్త‌లు మ‌నం చాలా సార్లు చ‌దివాం. కొంద‌రికి ఇలాంటివి అనుభ‌వాలు కూడా అయ్యింటాయి. ఇండోర్‌కు చెందిన మహ్మద్‌ మహువాలా కూడా ఇలాంటి వార్త‌ల‌ను చ‌దివాడు. అంతే త‌న‌ మెద‌డులో ఓ ఐడియా మెరిసింది. వెంట‌నే ఫేక్ మెయిల్ ఐడీలు, ఫోన్ నంబ‌ర్ల‌తో అమెజాన్‌లో ఖ‌రీదైన గ్యాడ్జెస్ట్‌, మొబైల్స్ ఆర్డ‌ర్ చేసేవాడు. డెలివ‌రీ కాగానే వాటిని బ‌య‌టి మార్కెట్లో అమ్మేసి.. పార్సిల్ ఖాళీగా ఉంద‌ని రిట‌ర్న్ చేసేవాడు. పాపం అమేజాన్ వారు త‌ప్పు త‌మ‌దే అనుకోని న‌గ‌దును రిఫండ్ చేసేవారు. ఇలా ఒక‌టి కాదు.. రెండు కాదు దాదాపు 30 ల‌క్ష‌ల మేర అమెజాన్‌కు కుచ్చుటోపి పెట్టాడు మ‌హ్మ‌ద్ మ‌హువాలా.

కొన్ని రోజులు ఈ త‌తంగం సాఫీగానే జ‌రిగినా.. అమెజాన్ సంస్థ అధికారులు ప‌దే ప‌దే ఇలాంటి ఫిర్యాదులు వ‌స్తుండ‌టంతో ఇంట‌ర్న‌ల్ ఇన్‌స్పెక్ష‌న్ చేశారు. అంతా సాఫీగానే ఉండ‌టంతో మ‌హ్మ‌ద్‌పై అనుమానం వచ్చి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు త‌మ‌స్టైల్‌లో విచార‌ణ జ‌ర‌ప‌డంతో అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టాడు మ‌హ్మ‌ద్‌. అంతేగాకుండా అత‌ని నుంచి ఖరీదైన మొబైల్‌ ఫోన్స్‌ను, రెండు స్మార్ట్‌ గడియారాలు, క్రెడిట్‌ కార్డు, వైర్‌లెస్‌ రూటర్‌తో పాటు ఇతర వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇతనికి అమెజాన్‌ సంస్థలో పని చేస్తున్న కొందరు ఉద్యోగులు కూడా సాయ‌ప‌డిన‌ట్లు పోలీసులు తేల్చారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -