Friday, April 19, 2024
- Advertisement -

తాజా అధ్యయనం: కరోనా ఎక్కువగా మగవారికే ఎందుకు వస్తుందంటే ?

- Advertisement -

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా వైరస్ నివారణకు పరిశోధనలు, అధ్యయనాలు జరుగుతున్నాయి. తాజాగా ఆసక్తికర విషయాలు వెల్లడవుతున్నాయి. ఈ నేపథ్యంలో మహిళల్లో కంటే పురుషుల్లోనే కరోనా తీవ్రత ఎక్కువ అనే విషయాన్ని ఇప్పటికే పలు అధ్యయనాలు వెల్లడించాయి.

కానీ అందుకు గల శాస్త్రీయ ఆధారాలు చూపించలేకపోయాయి. నెదర్లాండ్స్ కు చెందిన యూనివర్శిటీ మెడికల్ సెంటర్ (యూఎంసీ) నిర్వహించిన తాజా అధ్యయనం ద్వారా శాస్త్రీయ ఆధారాన్ని తెరపైకి తెచ్చింది. ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఆండ్రియాన్ వూర్స్ ఆ వివరాలను తెలిపారు. మహిళల్లో, పురుషుల్లో యాంజియోటెన్సిన్-కన్వర్టింగ్ ఎంజైమ్ 2 (ఏసీఈ 2) అనే ఎంజైమ్ సాయంతో కొవిడ్-19 కారక ‘సార్స్ -కొవ్ 2’ వైరస్ కణాల్లోకి ప్రవేశిస్తున్నట్టు గుర్తించారు.

అయితే, ఈ ఎంజైమ్ మహిళల్లో కంటే పురుషుల్లో ఎక్కువగా ఉండటంతో ‘కరోనా’ ప్రభావం పురుషుల్లోనే అధికంగా ఉన్నట్టు విశ్లేషించారు. ఏసీఈ2 ఎంజైమ్ ఊపిరితిత్తులు, గుండె, మూత్రపిండాలలో కంటే వృషణాల్లో అధికంగా ఉంటుందని, అందుకే, మగవారిలో ‘కరోనా’ తీవ్రత అధికంగా ఉంటోందని వూర్స్ తెలిపారు. ఈ వైరస్ ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించడానికి కూడా ఈ ఎంజైమే దోహదపడుతోందని, అందుకే, ‘కరోనా’ బారినపడ్డ వారికి శ్వాస సంబంధిత సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ అంశంపై ఇంకా లోతైన పరిశోధన జరిపి ధ్రువీకరించాల్సి ఉందని తెలిపారు.

కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్, డయాబెటీస్, మూత్రపిండాల సంబంధిత వ్యాధులలో ఏసీఈ సాంద్రతను నియంత్రించడానికి వాడే ఏసీఈ ఇన్ హిబిట్స్ లేదా యాంజియో టెన్సిన్ రిసెప్టార్ బ్లాకర్స్ (ఏఆర్ బీ)ను ‘కొవిడ్-19’ రోగులకు ఇవ్వొచ్చని, తద్వారా వైరస్ ప్రభావాన్ని తగ్గించవచ్చని తమ అధ్యయనం ద్వారా వూర్స్ సూచించారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -