Friday, March 29, 2024
- Advertisement -

26/11 ఉగ్రదాడి కుట్రదారుల స‌మాచారం ఇస్తే అమెరికా భారీ న‌జ‌రానా..

- Advertisement -

సరిగ్గా పదేళ్ల కిందట 2008 నవంబరు 26న పాకిస్థాన్‌ ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబాకు చెందిన పది మంది ఉగ్రవాదులు ముంబైలో ప్రవేశించి నాలుగు రోజుల పాటు మారణహోమానికి పాల్పడ్డారు. నాటి ఉగ్రదాడిలో 166 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మంది వరకు గాయపడ్డారు. చ‌నిపోయిన వారిలో 6 గురు అమెరికా పౌరులు ఉన్నారు. భారత తీరప్రాంత భద్రతలోని లోపాలను తేటతెల్లం చేసిన ఈ దర్ఘటనకు నేటితో పదేళ్లు పూర్తయ్యాయి.

ఆల్రెడీ ఈ కేసులో భారత్, కసబ్ సహా 10 మంది ఉగ్రవాదుల్ని పట్టుకున్నా, అసలు సూత్రధారుల తాట తియ్యాలని అమెరికా భావిస్తోంది. ఈ దాడికి కుట్ర పన్నినవారు, సహకరించినవారికి శిక్ష పడేలా అవసరమైన సమాచారం తెలిపినవారికి రూ.35.21 కోట్లు (5మిలియన్ డాలర్లు) అందిస్తామని అమెరికా ప్రభుత్వం ప్రకటించింది.

ఈదాడుల్లో చనిపోయిన వాళ్ల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలుపుతున్నట్లు అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఓ ప్రకటన విడుదల చేశారు. బాధితులకు అండగా ఉంటామన్న ఆయన, ఈ దుశ్చర్యకు పాల్పడిన వాళ్లను వదిలి పెట్టే ప్రసక్తే లేదన్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -