కరోనా ధాటికి ఒక్కరోజులోనే 1480 మంది మృతి..!

1041
32000 new cases in us and 1480 people killed in 24 hours
32000 new cases in us and 1480 people killed in 24 hours

ప్రస్తుతం అమెరికా దేశం కారోనా ధాటికి అల్లాడుతోంది. ప్రపంచ దేశాల్లో ఈ వైరస్ విజృంభించినా ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకుంటున్నాయి. అయితే అమెరికాలో మాత్రం ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల అక్కడ పరిస్థితి చేయి దాటిపోయింది. ఓ వైపు పాజిటివ్ కేసుల సంఖ్య దారుణంగా పెరుగుతుంటే.. మరో పక్క మరణాలు రోజు రోజుకి ఎక్కువవుతున్నాయి.

24 గంటల వ్యవధిలోనే 1480 మంది మృత్యువాత పడ్డారు. గురువారం రాత్రి 8.30 నుంచి శుక్రవారం రాత్రి 8.30 గంటల మధ్య ఈ మరణాలు సంభవించినట్టు జాన్స్ హాఫ్కిన్స్ యూనివర్సిటీ వెల్లడించింది. మరోవైపు అగ్రరాజ్యంలో కరోనా కేసుల సంఖ్య 2 లక్షల 77 వేల 467 కు చేరింది. ఇప్పటిదాకా 7402 మంది చనిపోయారు. శుక్రవారం ఒక్క రోజే 32 వేల పైచిలుకు కొత్త కేసులు నమోదయ్యాయి. అయితే కొత్తగా వస్తున్న రోగులకు చికిత్స చేసేందుకు వైద్య సిబ్బంది నానా ఇబ్బంది పడుతున్నారు. మరణాల సంఖ్య పెరుగుతుండడంతో శ్మశానవాటికల వద్ద తీవ్ర రద్దీ నెలకొంది.

నిర్వాహకులపై ఒత్తిడి పెరుగుతోంది. ఒత్తిడి తట్టుకోలేక శ్మశానవాటిక నిర్వాహకులు చేతులు ఎత్తేస్తున్నారు. మృతదేహాలను కొంతకాలం పాటు ఆసుపత్రుల్లోనే ఉంచాలని మృతుల బంధువులను కోరుతున్నారు. బ్రూక్లిన్‌లోని శ్మశానవాటికలో ఒకేసారి 60 మృతదేహాలను ఖననం చేసే వీలుంది. అయితే, గురువారం ఉదయం ఒకేసారి 185 మృతదేహాలు రావడంతో ఏం చేయాలో తెలియక నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు.

Loading...