Friday, March 29, 2024
- Advertisement -

తెలుగు రాష్ట్రాల‌పై చ‌లి పంజా….34 మంది మృతి

- Advertisement -

తెలుగు రాష్ట్రాలను చలిపులి చంపేస్తోంది. పగలు, రాత్రి అన్న తేడా లేకుండా అన్ని చోట్లా రాత్రి దారుణంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సగటు ఉష్ణోగ్రతలు రెండు నుంచి ఐదు డిగ్రీల వరకూ పడిపోయాయి. చలి తీవ్రతకు రెండు రాష్ట్రాల్లో 34 మంది మరణించారు. ఏపీలో 23 మంది, తెలంగాణలో 11 మంది మరణించారు. విశాఖ జిల్లాల్లో అత్యధికంగా ఆరుగురు, ప్రకాశం జిల్లాలో ఐదుగురు, తూర్పుగోదావరి, శ్రీకాకుళం, గుంటూరు జిల్లాల్లో ముగ్గురు, విజయనగరంలో ఇద్దరు, పశ్చిమగోదావరి జిల్లాలో ఒకరు చనిపోయారు.

రాత్రి లాగే, పగటి వేళ కూడా చలి ఎక్కువగా ఉంటోంది. ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జనం భయపడుతున్నారు. ఇళ్ల తలుపులు, కిటికీలన్నీ బిగించినా చలి ఆగట్లేదు. ఈ పరిస్థితులలో స్కూళ్లలో, సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న పిల్లలు చలికి తట్టుకోలేక గజగజ వణుకున్నారు.

ఏజెన్సీ, కోస్తాతీర ప్రాంతం, ఉత్తర తెలంగాణాల్లో చలి వాతావరణం ఎక్కువగా ఉంది. బంగాళాఖాతంలో తుఫాన్‌, ఉత్తరాది నుంచి వీస్తున్న గాలులతో తెలంగాణ, కోస్తాల్లో చలి తీవ్రత పెరిగింది. పెథాయ్‌ తుఫాన్‌ తీరం వైపు పయనించే సమయంలో కోస్తాలో గాలుల తీవ్రత పెరిగి మేఘాలు ఏర్పడ్డాయి. శీతాకాలం కావడంతో సముద్రం మీదుగా వచ్చే చల్లటి గాలులు కూడా తోడయ్యాయి. ఉత్తరాది నుంచి చలిగాలులు మధ్యభారతం, దానికి ఆనుకుని తెలంగాణ, ఒడిశా వరకు వీస్తున్నాయి.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -