టీటీడీలో మరో కలకలం…వెండి, బంగారు మాయం

236
5 KG Silver Crown and gold missing from world's-richest Tirupati temple
5 KG Silver Crown and gold missing from world's-richest Tirupati temple

తిరుమల తిరుపతి దేవస్థానం వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతోంది.రూ.5 కోట్ల స్కామ్‌పై ఓవైపు విచారణ జరుగుతుండగా.. మరోవైపు ఏకంగా తిరుమలకు వెళ్లే బస్సు టికెట్లపై అన్యమత ప్రచారం కలకలం రేపింది. తాజాగా ట్రెజరీలోని శ్రీవారి నగలు మాయం కావడంతో ఇప్పుడు అందరి దృష్టి తిరుమలపై పడింది.

ట్రెజరీలో ఉన్న 5 కిలోల వెండి కిరీటం, రెండు బంగారం ఉంగరాలు మాయమయ్యాయి. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చినట్లు తెలుస్తోంది. దీనికి టీటీడీ ఏఈవో శ్రీనివాసులును బాధ్యునిగా చేస్తూ అధికారులు చర్యలు తీసుకున్నారు.అయితే శ్రీనివాసులుపై ఏకపక్షంగా చర్యలు తీసుకోవడంపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. కఠిన చర్యలు తీసుకోకుండా కేవలం రికవరీ మాత్రమే చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.

Loading...