Friday, April 19, 2024
- Advertisement -

క‌ర్నాట‌క ప్ర‌భుత్వం సంచ‌ల‌న నిర్ణ‌యం…

- Advertisement -

దేశంలో అన్ని ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌కు, బ్యాంక్ అకౌంట్ల‌తో పాటు మిగితా వ‌న్నింటికి కూడా ఆధార్ కార్డు తప్ప‌ని స‌రిచేసింది కేంద్ర ప్ర‌భుత్వం. ఆధార్ సెగ దేవునికి కూడా త‌గిలింది. దేవున్ని ద‌ర్శించుకోవాలంటె ఇక నుంచి ఆధార్‌ను త‌ప్ప‌న‌స‌రిచేసింది క‌ర్నాట‌క ప్ర‌భుత్వం.

ఉంత్త‌రాఖాండ్‌లో ఉన్న ప్ర‌సిద్ధ పుణ్య‌క్షేత్రాలైన బ‌ద్రీనాధ్‌, కేదార్‌నాధ్‌, గంగోత్రి, య‌మునోత్రి తీర్థ‌యాత్ర‌ల‌కు వెల్లాల‌ను కొనె భ‌క్తులు ఆధార్ గుర్తింపు కార్డు ఉండాల్సిందే. ఈ పుణ్యయాత్రలకు వెళ్లే వారికి ఆధార్‌ కార్డును తప్పనిసరి చేస్తూ కర్నాటక ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. యాత్రికులకు ప్రభుత్వం అందిస్తున్న 20వేల రూపాయల ట్రావెల్‌ సబ్సిడీ దుర్వినియోగమవుతుందనే భయాందోళనతో కర్నాటక ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో శాశ్వ‌త నివాసం క‌లిగిన‌ 1000-1500 మంది ప్రజలకు ఛార్‌ ధామ్‌ యాత్రం కోసం ప్రతేడాది ట్రావెల్‌ సబ్సిడీ క‌ల్పించింది ప్ర‌భుత్వం. ప్రభుత్వం అందించే సబ్సిడీలపై ట్రావెల్‌ ఆపరేటర్లు భక్తులకు పలు తప్పుడు మార్గాలను సూచిస్తున్నారు. తప్పుడు ప్రయాణ పత్రాలు సమర్పించి సబ్సిడీ మొత్తాన్ని దుర్వినియోగ పరచాలని చూస్తున్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని క‌ర్నాట‌క ప్ర‌భుత్వం ఆధార్ కార్డును త‌ప్ప‌నిస‌రిచేసింది. పేద, మధ్య తరగతి ప్రజలు ఈ యాత్రకు వెళ్లేందుకు ఈ ట్రావెల్‌ సబ్సిడీని అందుబాటులోకి తెచ్చారు. ఇదే విధానం అన్ని రాష్ట్రాలు కూడా పాటించె అవ‌కాశాలు లేక‌పోలేదు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -