కరోనా భీభత్సం.. ఒక్కరోజులో లక్ష కేసులు..!

345
above one lakh new corona cases in last 24 hours
above one lakh new corona cases in last 24 hours

కరోనా వైరస్ తగ్గే పరిస్థితి ఎక్కడ కూడా కనిపించడం లేదు. రోజు రోజుకి ఈ వైరస్ ఎక్కువ అవుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో లక్ష మందికి ఈ కరోనా వైరస్ సోకింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 51.32 లక్షలకు పెరిగింది. అమెరికాతో పాటు బ్రిటన్, మెక్సికో, బ్రెజిల్ తదితర దేశాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. నిన్న ఒక్క రోజులో కొత్త కేసుల సంఖ్య 1.06 లక్షలను దాటింది.

వ్యాధి సోకినవారిలో ఇప్పటివరకూ 20 లక్షల మంది కోలుకున్నారని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలియజేశారు. తొలి కేసు వచ్చిన తరువాత ఒక్క రోజులో ఇన్ని కేసులు రావడం ఇదే తొలిసారి. ఇక అమెరికాలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 16 లక్షలను దాటడం గమనార్హం. బ్రెజిల్ లో మొత్తం కేసుల సంఖ్య 36 వేలు దాటగా, రష్యాలో కొత్తగా 8,849 కేసులు వచ్చాయి. కరోనా వైరస్ చైనాలో రూపు మార్చుకుందని ఇప్పటికే వార్తలు రాగా, జిలిన్ పట్టణంలో తాజాగా 130 కేసులు వచ్చాయి. ఇక్కడ మరోసారి లాక్ డౌన్ ను విధించారు.

ఇక ఎలాంటి లక్షణాలు లేకున్న.. పరీక్షలు చేస్తే కరోనా పాజిటివ్ సోకిన వారి సంఖ్య పెరుగుతుంది. చైనాలో 31 అసింప్టమాటిక్ కేసులు రాగా, అందులో 28 వూహాన్ లోనే నమోదుకావడం గమనార్హం. ఇక ప్రపంచవ్యాప్తంగా కరోనా కారణంగా మరణాల సంఖ్య 3,31,880కి చేరుకుంది. వీటిల్లో అమెరికాలో 94,496, బ్రిటన్ లో 36,042, ఇటలీలో 32,486, ఫ్రాన్స్ లో 28,132, స్పెయిన్ లో 27,940, బ్రెజిల్ లో 19,148, బెల్జియంలో 9,186, జర్మనీలో 8,273, ఇండియాలో 3583 మంది మరణించారు.

Loading...