దిశ కేసులో నిందుతుల ఎన్ కౌంటర్ చేసిన పోలీసులు

1236
All 4 Accused In Rape, Murder Of Telangana Vet Killed In Encounter
All 4 Accused In Rape, Murder Of Telangana Vet Killed In Encounter

డాక్టర్ దిశ అత్యాచారం, హత్య సంఘటనలో పోలీసులు సంచలన నిర్ణయం తీసుకున్నారు. నిందితులను ఎన్‍కౌంటర్ చేశారు. నిందితులను కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. వారి వద్ద నుంచి కీలక ఆధారాలు సేకరిస్తున్న క్రమంలో సీన్ రీ కన్‍స్ట్రక్షన్ చేస్తుండగా.. తప్పించుకునేందుకు యత్నించారు. దాంతో ఎన్ కౌంటర్ చేసినట్లు సమాచారం.

పారిపోతున్న నలుగురు నిందితులపై కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. షాద్ నగర్ లోని సంఘటనా స్థలంలోనే దిశ కేసులో నిందితుల ఎన్ కౌంటర్ చేశారు. నిన్న ఉదయం నలుగురు నిండితులను కస్టడీలోకి తీసుకుని రహస్య విచారణ జరిపారు. ఇదే సమయంలో సంఘటనా స్థలంలో రీ కన్ స్ట్రక్షన్ చేస్తుండగా నలుగురు నిందితులు తప్పించుకునేందుకు పరుగు పెట్టారు.

దాంతో.. పోలీసులు వారిని ఎన్ కౌంటర్ చేశారు. దిశ హత్యాచారంలో కేసులో.. జొల్లు శివ, మహమ్మద్, జొల్లు నవీన్, చెన్నకేశవులు చనిపోయారనీ పోలీసులు నిర్దారించారు. చటాన్ పల్లి బ్రిడ్జి కింద దిశను చంపిన స్థలంలోనే పోలీస్ వాహనాల పైన రాళ్లతో దాడి చేయగా, పోలీసు వాహనాలు ధ్వంసమయ్యాయి.

దీంతో పోలీసులు తప్పించుకొని పారిపోతు, తిరిగి తమపై దాడి చేస్తున్న క్రమంలో ఆత్మరక్షణ కోసం నిందితులపై కాల్పులు జరిపి వారిని హతమార్చినట్లు గా తెలుస్తుంది. నిందితులను షాద్ నగర్ వద్ద పోలీసులు ఎన్ కౌంటర్ చేయడంతో దిశ తల్లిదండ్రులు పోలీసులు చర్యను అభినందిస్తున్నారు. నిందితులకు తగిన శిక్ష పడిందని.. ఈ కేసు న్యాయం జరిగిందని దిశ తల్లిందండ్రులు చెప్తున్నారు.

Loading...