Friday, April 19, 2024
- Advertisement -

ఏపీపీఎస్సీ చైర్మన్ పై పలు ఆరోపనలు!

- Advertisement -

ఏపీపీఎస్సీ చైర్మన్ పరీక్షల నిర్వహణ నుంచి ఉద్యోగుల ప్రమోషన్లు, సంస్థ నిర్వహణ వరకూ అంతా అవినీతి రాజ్యమేలుతోందన్న విమర్శలున్నాయి. జగన్ సర్కారుకు చెడ్డపేరు తెచ్చేలా ఏపీపీఎస్సీ చైర్మన్ వ్యవహరిస్తున్నారని వైసీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.

చంద్రబాబు హయాంలో నామినేట్ అయిన ఏపీపీఎస్సీ చైర్మన్ జగన్ సర్కారు అభాసుపాలయ్యేలా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. తన సామాజిక వర్గానికి మాత్రమే లాభం చేకూర్చేలా ఒంటెద్దు పోకడలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఏపీపీఎస్సీ చైర్మన్ తీసుకుంటున్న ప్రతీ నిర్ణయాలపై నిరుద్యోగులు, అధికార వర్గాలు సైతం నెత్తినోరు బాదేసుకుంటున్నాయి. చైర్మన్‌ హోదాలో మిగిలిన సభ్యులతో కనీస సంప్రదింపులు జరపకుండా గ్రూప్‌1,2,3 పరీక్షలకు సంబంధించిన సిలబస్‌ను అనేకసార్లు మార్చుతూ విద్యార్థుల భవిష్యత్తును ఫణంగా పెడుతున్నాడని స్వయంగా ఏపీపీఎస్సీ వర్గాలే ఆరోపిస్తున్నాయి.. పదే పదే సిలబస్‌ మార్చడం మూలంగా విద్యార్థులు ఈ పరీక్షలకు ఏ సిలబస్‌ చదువుకోవాలో తెలియక గందరగోళంలో పడుతున్నారు.

ఇక హైదరాబాద్ లోని ఒక అనామక కోచింగ్‌ సెంటర్‌తోఏపీపీఎస్సీ చైర్మన్ కి లింక్ ఉందని.. ఆ సెంటర్ తో లావాదేవీలు నడుపుతూ తెరవెనుక వ్యాపారాలు కూడా చేస్తురని విద్యార్థులు, వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ఆ కేంద్రాల్లోనే కోచింగ్‌ తీసుకునేలా ఒప్పందం కుదిర్చుకున్నారని విద్యార్థులు బహిరంగంగానే కామెంట్ చేస్తున్నారు.

ఇక ప్రశ్నాపత్రాల తయారీలో సబ్జెక్ట్‌లో లేనటువంటి ప్రశ్నలను గ్రూప్‌1 పరీక్షలో పొందుపరిచడం తాజాగా దుమారం రేపింది. ఈ ప్రశ్నాపత్రంలో 25 తప్పులు రావడంతో అనేక మంది విద్యార్థులు నష్టపోయారు.

ఇప్పటికైనా ఏపీపీఎస్సీపై దృష్టిసారించి జగన్ సర్కారు గవర్నర్ ద్వారా ఏపీపీఎస్సీని సంస్కరించకపోతే నిరుద్యోగుల జీవితాలు నాశనం కావడం ఖాయమని మేధావులు హెచ్చరిస్తున్నారు.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -