Thursday, March 28, 2024
- Advertisement -

3 రాజధానులపై అమరావతి రైతుల న్యాయ పోరాటం

- Advertisement -

అమరావతి రైతుల పోరాటం కొత్త మలుపు తిరిగింది. సీఎం జగన్ 3 రాజధానుల బిల్లును శాసనసభలో ఆమోదించడం.. అమరావతి రైతుల పోరాటాన్ని పట్టించుకోకపోవడంతో వారంతా అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.

తాజాగా మూడు రాజధానులపై అమరావతి రైతులు న్యాయ పోరాటం ప్రారంభించారు. హైకోర్టుకెక్కారు. ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతిని కొనసాగించాలని కోరుతూ అమరావతి రైతులు తాజాగా హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.ఈ పిటీషన్ ను బుధవారం మధ్యాహ్నం విచారిస్తామని హైకోర్టు తెలిపింది.

అమరావతికి చెందిన 37మంది రైతులు ఈ పిటీషన్ ను దాఖలు చేశారు. అమరావతిలో 36 రోజులుగా ఆందోళన చేస్తున్నామని.. వైసీపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని హైకోర్టుకులో పిటీషన్ వేశారు. సంపూర్ణంగా బంద్ చేసినా పోలీసులు నిషేధాజ్ఞలు విధిస్తున్నారని విన్నవించారు.

అమరావతి రైతుల న్యాయపోరాటం నేపథ్యంలో ఈ ఉద్యమం కొత్త మలుపు తిరిగింది. హైకోర్టు ప్రభుత్వం బిల్లు రూపంలో తెచ్చిన 3 రాజధానులపై ఎలాంటి తీర్పునిస్తుందనే ఉత్కంఠ నెలకొంది.

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -