Friday, April 19, 2024
- Advertisement -

భయంతో జనం పరుగులు

- Advertisement -

నాలుగు రోజుల క్రితమే భయంకర భూకంపానికి అతలాకుతలమైన ఈక్వెడార్ బుధవారం నాడు మరోసారి వచ్చిన ప్రకంపనలతో ఠారెత్తింది. ఈసారి దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6.1 గా నమోదైంది. ఈ భూకంపం థాటికి ఈక్వెడార్ లోని తీర ప్రాంతాలన్నీ కంపించాయి.

ముయిసె పట్టణానికి పశ్చిమంగా సముద్రంలో 15 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రంగా గుర్తించారు. ఇంతకు ముందు ఈ నెల 16 వతేదిన వచ్చిన భూకంపం కారణంగా దాదాపు ఐదు వందల మంది మరణించారు. శిధిలాల కిందఇంకా అనేక మంది ఉండి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు.

వారం క్రితం వచ్చిన భూకంపం నుంచి ఇంకా తేరుకోక ముందు మరోసారి భూమి కంపించడం పట్ల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఓ భారీ భూకంపం సంభవించిన తర్వాత రెండు మూడు నెలల పాటు అప్పుడప్పుడు ఇలా భూమి కంపించడం సహజమేనని నిపుణులు చెబుతున్నారు. 

Related Articles

- Advertisement -

Most Populer

- Advertisement -

Latest News

- Advertisement -